World Largest flower: ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం రాఫ్లేసియా ఆర్నాల్డి.. ట్రెక్కింగ్ చేసే వ్యక్తికి కనిపించిన పుష్పం..
ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పంగా రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం ప్రసిద్ధిగాంచింది. దీన్ని బీట్ చేసే పువ్వును ఇప్పటివరకూ ఎవరూ కనుక్కోలేకపోయారు.
ఈ విశ్వంలో అంతులేని వింత విశేషాలు ఎన్నెన్నో.. మన భూమిపై అత్యద్భుతాల్లో అది ఒకటి. ఇండోనేషియా అడవుల్లో మాత్రమే విరబూసే అరుదైన పువ్వు. ఇది ఒక్కటి రావాలన్నా కొన్నేళ్లు పడుతుంది. అలాంటి పువ్వు ఓ సాధారణ వ్యక్తికి అనుకోకుండా అడవిలో కనిపించింది. ట్రెక్కింగ్ చేసే వ్యక్తికి కంటపడింది. అతి పెద్ద పువ్వుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పంగా రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం ప్రసిద్ధిగాంచింది. దీన్ని బీట్ చేసే పువ్వును ఇప్పటివరకూ ఎవరూ కనుక్కోలేకపోయారు. అందుకోసమే ఇది పెద్ద పుష్పంగా రికార్డుల్లోకెక్కింది. కానీ ఈ పుష్పం వికసించే సమయంలో ఘోరమైన దుర్వాసన వస్తుందట. మూడు అడుగు పొడవు ఉండే ఈ పుష్పం.. కేవలం 4 రోజుల పాటు మాత్రమే వికసిస్తుంది. దీని బరువు 15 పౌండ్ల వరకు ఉంటుంది. అరుదుగా కనిపించే ఈ పుష్పాన్ని చూసేందుకు అనేక మంది ఆరాటపడుతుంటారు. కాగా, ఈ పుష్పానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..