King cobra in police station: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది..! పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కింగ్ కోబ్రా.. వీడియో
ఉత్తరప్రదేశ్‌లో జలౌన్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఓ నాగుపాము కనిపించడంతో పోలీసు అధికారులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
ఓ పోలీస్ స్టేషన్‌లో కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో జలౌన్‌లోని పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఓ నాగుపాము పోలీస్ స్టేషన్‌లో కనిపించడంతో పోలీసు అధికారులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అదెక్కడ కాటేస్తుందోనని.. అంతా ఆందోళన చెందారు. స్టేషన్‌కు వచ్చిన ప్రజలు కూడా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అనంతరం స్నేక్ క్యాచర్ దానిని పట్టుకుని బంధించాడు. అయితే.. వీడియోలో స్నేక్ క్యాచర్ నాగుపామును శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది బుసలు కొట్టింది. అది చూసి పోలీసులు తీవ్ర ఆందోళన పడ్డారు. శాంతి పేరు దేవుడెరుగు..అదెక్కడ అతన్ని కాటేస్తుందో అని భయపడ్డారు. మొత్తానికి ఆ కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ బంధించి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అ ఈ పాము కొన్ని నిమిషాలపాటు పడగవిప్పి బుసలు కొడుతూనే ఉందన్నారు. కాగా.. పోలీస్ స్టేషన్ యమునా నది ఒడ్డున ఉండటం వల్లే తరచూ ఇలా పాములు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ కింగ్ కోబ్రా కు వచ్చిందని తెలిపారు. నది ఒడ్డు నుంచి ప్రతిరోజూ పాములు స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి వస్తుంటాయని పోలీస్ స్టేషన్ చీఫ్ అఖిలేష్ ద్వివేది తెలిపారు. ఇంతకు ముందు కూడా పాములు వచ్చాయని కానీ.. ఈ పాము మాత్రం మరింత భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని వీక్షించి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

