ఆ ఆలుగడ్డ ధర కేజీ రూ. లక్ష.. ఎక్కడో తెలుసా ??

Updated on: Nov 19, 2025 | 6:05 PM

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంప 'లా బొన్నొట్టే' గురించి ఈ కథనం. ఫ్రాన్స్‌లోని ఇలే డీ నాయిర్మౌషియర్ దీవిలో సాగుచేసే ఈ ప్రత్యేకమైన ఆలుగడ్డ కిలో ధర లక్ష రూపాయలు. పరిమిత దిగుబడి, ప్రత్యేకమైన రుచి, సముద్రపు గడ్డి ఎరువులతో కూడిన అరుదైన సాగు విధానం దీని అధిక ధరకు ప్రధాన కారణాలు. దీని ఆరోగ్య ప్రయోజనాలు, డిమాండ్ కూడా ఎక్కువ.

బంగాళాదుంపలేంటీ.. కేజీ లక్ష రూపాయలేంటీ అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. భారత్‌లో బంగాళాదుంపలు కేజీ కేవలం రూ.25కే లభిస్తుంటే, ఆసియా దేశాల్లో వాటి ధరలు రూ.380 నుంచి లక్ష వరకు చేరాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంప పేరు.. లా బొన్నొట్టే. ఈ రకం బంగాళాదుంప కేజీ ధర ఏకంగా లక్ష రూపాయలు. దీనికి ఎందుకంత ధర? దీని ప్రత్యేకతేంటి అనేది ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో బంగాళదుంపలను ఎక్కువగా వినియోగిస్తారు. దేశంలో ప్రధాన ఆహారంగా వినియోగించే బంగాళాదుంపలు ఇక్కడ ప్రజలకు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. దేశీయ మార్కెట్‌లో కేజీ బంగాళాదుంప కేవలం రూ.25 నుంచి 40 వరకూ లభిస్తాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా దీని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాలలో బంగాళాదుంపల ధరలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంపగా గుర్తింపు పొందిన లా బొన్నొట్టే ఆలుగడ్డ ధర కూడా ఆకాశాన్ని తాకింది. ఫ్రాన్స్‌లో లభించే ఈ రకం ప్రత్యేకమైన బంగాళాదుంప కిలో ధర దాదాపు లక్ష రూపాయలు కావడం విశేషం. ఇంత ఖరీదైనప్పటికీ దానిని కొనుగోలు చేయడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. లా బొన్నొట్టే బంగాళదుంప దిగుబడి చాలా తక్కువ. ఇది ప్రతి సంవత్సరం మే, జూన్ నెలల్లో మాత్రమే మార్కెట్‌కు వస్తుంది. ఫ్రాన్స్‌లో కూడా ఇలే డీ నాయిర్మౌషియర్ అనే ఒక దీవిలో మాత్రమే ఈ దుంపలను సాగుచేస్తారు. ఆ దీవిలో ఓరకమైన ఇసుక నేలలో దీనిని సాగుచేస్తున్నారు. కేవలం సముద్రంలో లభించే ఓ రకమైన గడ్డి ని ఎరువుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా వాటిని కేవలం 50 చదరపు మీటర్ల ప్రదేశంలో మాత్రమే సాగు చేస్తున్నారట. అంతేకాకుండా ఆ దుంపలకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ఆ దుంపలు సంవత్సరం అంతా లభించవు.వాటి సాగును ప్రారంభించిన తర్వాత మూడు నెలలకు పంట చేతికి అందుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పంట సాగు చేయడం ప్రారంభించగా మీలో దిగుబడి వస్తుంది. చేతులతో వీటిని ఇసుక నుంచి బయటకు తీస్తారు. అయితే దుంపలు కాస్త ఉప్పుగా ఉంటాయి. కానీ అవి కొన్ని రకాల వ్యాధులను నయం చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ బంగాళాదుంపకు చాలా ప్రత్యేకమైన, అద్భుతమైన రుచి ఉండటం వల్ల దీనికి అధిక డిమాండ్ ఉంటుంది. ఈ దుంపలను మొట్టమొదట పండించిన రైతు బెనాయిట్ బోనోట్ పేరు మీదుగా వీటికి ఆ పేరు పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొనేదెలా.. తినేదెలా.. వెజి’ట్రబుల్స్‌’

షూటింగ్‌లో జక్కన్న టార్చర్‌ తట్టుకోలేకపోయా

అమ్మో గొరిల్లా.. దెబ్బకు కోతులు పరార్

షూటింగ్‌లో జక్కన్న టార్చర్‌ తట్టుకోలేకపోయా

అప్పు తీర్చమని అడిగినందుకు ఎంత పని చేశావురా ??