Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Killer wife: ఏకాంతంగా గడుపుదామని తీసుకెళ్లి.. కరెంట్‌ షాక్‌ ఇచ్చి.. మామకు ఫోన్‌ చేసి..(వీడియో)

Killer wife: ఏకాంతంగా గడుపుదామని తీసుకెళ్లి.. కరెంట్‌ షాక్‌ ఇచ్చి.. మామకు ఫోన్‌ చేసి..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 23, 2022 | 9:49 PM

పెళ్లైన కొన్నాళ్లకే మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తన సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో దారుణానికి పాల్పడింది. కొత్తగా పెళ్లయింది..వేరు ఇంట్లో నిద్రపోతామని ఇంట్లో వాళ్లను నమ్మించింది.


పెళ్లైన కొన్నాళ్లకే మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తన సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో దారుణానికి పాల్పడింది. కొత్తగా పెళ్లయింది..వేరు ఇంట్లో నిద్రపోతామని ఇంట్లో వాళ్లను నమ్మించింది. ఏకాంతంగా గడపాలంటూ భర్తను తనతో పాటు తీసుకెళ్లింది. అర్ధరాత్రి సమయంలో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మథుర జిల్లా బల్దేవ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సేల్‌ఖేఢా గ్రామానికి చెందిన సుబేదార్‌సింగ్‌ ఈ ఏడాది మార్చిలో అతని చిన్న కుమారుడు మాన్వేంద్రకు వివాహం చేశాడు. గ్రామ శివారులో వారికి మరో ఇల్లు ఉంది. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత మాన్వేంద్ర దంపతులు ఓ రోజు రాత్రి ఆ ఇంట్రో నిద్రించారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కోడలు.. తన మామకు ఫోన్ చేసి మాన్వేంద్రకు కరెంట్‌ షాక్‌ కొట్టిందని తెలిపింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు మాన్వేంద్రను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మాన్వేంద్ర చనిపోయినట్లు నిర్ధరించారు.ప్రమాదవశాత్తు కొడుకు చనిపోయాడని భావించిన తల్లిదండ్రులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మాన్వేంద్ర చనిపోయిన కొన్ని రోజులకు అతని ఫోన్ కు కాల్స్‌ విపరీతంగా వచ్చేవి. దీంతో అనుమానం వ్యక్తం చేసిన సుబేదార్‌ మాన్వేంద్ర ఫోన్ ను దాచి పెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోన్ కు వచ్చే కాల్స్ ను పరిశీలించాడు. ఫోన్ లో తన కోడలు వేరే వ్యక్తితో మాట్లాడిన కాల్ రికార్డ్ బయటపడింది. అందులో నువ్వు చెప్పినట్టే 10 నిమిషాలు కరెంట్‌ షాక్‌ ఇచ్చాను అని కోడలు చెప్పడాన్ని గుర్తించాడు. ఆడియో ఆధారంగా కోడల్ని నిలదీశాడు. ఆమె సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసుల విచారణలో భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది. మాన్వేంద్ర చనిపోయిన తర్వాత పుట్టింటికి వెళ్లిన ఆమె.. ప్రియుడు అతేంద్రతో కలిసి పరారైంది. కాగా.. సుబేదార్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరినీ పట్టుకున్నారు. ఈ ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Published on: Sep 23, 2022 09:49 PM