10 సార్లు ప్రయత్నించినా పడలేదు..పదకొండోసారి కరుణించిన గంగమ్మ..! వీడియో
పొలాలకు నీళ్లు కావాలన్నా, ఇంటి అవసరాలకు నీరు కావాలన్నా బోర్లు తవ్వి మోటార్లు బిగించడం సర్వసాధారణం. అయితే బోరు వేసిన ప్రతిచోటా, ప్రతిసారీ నీరు పడుతుందా అంటే చెప్పలేం. బోరు వెయ్యగానే నీరుపడింది అంటే అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే రాను రానూ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయనే హెచ్చరికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు పడటం కొంచెం కష్టమే.
అయితే ఓ రైతు నీటి కోసం 10 సార్లు ప్రయత్నించినా ఫలించలేదు. అయినా ఎక్కడో మిగిలిన చిన్న ఆశ అతన్ని మరోసారి ప్రయత్నించేలా చేసింది. ఎట్టకేలకు గంగమ్మ కరుణించింది. మోటారు వేయకుండానే సహజసిద్ధంగా పాతాళ గంగమ్మ ఉబికి వస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా, ఓబుల దేవర చెరువు మండలం వెంకటాపురం పంచాయతీ, పాలేనివారి పల్లిలో రైతు గంగరాజు పొలంలో బోరు బావి ఎండిపోయింది. లక్షలు ఖర్చుపెట్టి 10సార్లు బోర్లు వేయించాడు రైతు. చివరికి అప్పల పాలైపోయాడు.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో