Warangal: పోలీసులకే సినిమా చూపించారు..! పుష్ప సినిమా స్టైల్లో అక్రమ రవాణా.. పోలీసులు షాక్.!

|

Oct 19, 2023 | 5:19 PM

పోలీసులు ఎంత నిఘాపెట్టినా, అక్రమ రవాణా ఆగడం లేదు. ఎక్కడో అక్కడ గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తాజాగా వరంగల్‌లో ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. పుష్ప సినిమాను తలపించేలా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకే సినిమా చూపించారు. గంజాయి తరలించడంలో స్మగ్లర్ల ప్లాన్‌ చూసి పోలీసులు షాకయ్యారు.ఆంధ్రప్రదేశ్ నుండి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణాకు..

పోలీసులు ఎంత నిఘాపెట్టినా, అక్రమ రవాణా ఆగడం లేదు. ఎక్కడో అక్కడ గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తాజాగా వరంగల్‌లో ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. పుష్ప సినిమాను తలపించేలా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకే సినిమా చూపించారు. గంజాయి తరలించడంలో స్మగ్లర్ల ప్లాన్‌ చూసి పోలీసులు షాకయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.. వారివద్దనుంచి 75 లక్షల విలువగల మూడు వందల కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒకరు మధ్యప్రదేశ్ కు చెందిన కోలి రాజా వర్మ, కాగా ఇంకొకరు మహారాష్ట్రకు చెందిన పార్టిల్ నామ్‌దేవ్‌. రాహుల్ సబులే, శుభం గోతీరామ్ సబులే, శేషుకుమార్ అనే మరో ముగ్గురు పరారిలో వున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఎండు గంజాయిని కొనుగోలు చేసిన స్మగ్లర్లు ప్యాకెట్లలో నింపి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. గంజాయి రవాణా కు కోసం ఓ సీడీఎం వ్యానులో ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నారు. వీరి ప్లాన్‌ అచ్చం పుష్ఫసినిమాలోని సీన్‌ను తలపిస్తోంది. డీసీఎం వ్యాను పై కప్పు పైన మరో లేయర్ ఏర్పాటు చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా అందులో గంజాయి ప్యాకెట్లను భద్ర పరిచారు. ఇంటి పై కప్పు మీద పెంకులు అమర్చినట్లుగా గంజాయి ప్యాకెట్లను అమర్చి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అప్పటికే సుమారు ఆరు వందల కిలో మీటర్లు ప్రయాణం చేశారు. పదులు సంఖ్యలో పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక చెక్ పోస్టులు దాటి వచ్చారు. వరంగల్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై పక్కాసమాచారం ఉన్న వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. హసన్ పర్తి మీదుగా వెళ్తున్న వ్యానును పెంచికలపేట లోని చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుకున్నారు. వ్యానును తనిఖీ చేయగా డీసీఎం పై భాగంలో సపరేట్ గా ఏర్పాటు చేసుకున్న తీరు చూసి అవాక్కయ్యారు. గంజాయి తో పాటు, వాహనం సీజ్ చేసి నిందితులను రిమాండ్ కు పంపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..