Train Two Parts Video: రెండుగా విడిపోయిన రైలు బోగీలు..! కామారెడ్డిలో షాకింగ్..వైరల్ అవుతున్న వీడియో..

|

Sep 26, 2021 | 8:31 PM

వేగంగా వెళ్తున్న రైలు ఇంజిన్, బోగీలు విడిపోయి వెళ్లిపోయిన ఘటనలు చూశాం. ఇంజన్ నుంచి విడిపోవడంతో బోగీలు ఎక్కడో గుర్తు తెలియని ప్రాంతాల్లో నిలిచిపోయిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది...

వేగంగా వెళ్తున్న రైలు ఇంజిన్, బోగీలు విడిపోయి వెళ్లిపోయిన ఘటనలు చూశాం. ఇంజన్ నుంచి విడిపోవడంతో బోగీలు ఎక్కడో గుర్తు తెలియని ప్రాంతాల్లో నిలిచిపోయిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రమాదం జరిగింది మాత్రం గూడ్స్ రైలుకి..

వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి వెనక ఉన్న కంటైనర్లు విడిపోయిన షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కామారెడ్డి రైల్వే గేటు వద్దకు వచ్చే సరికి బోగీలకు ఉన్న లింకులు ఊడిపోయాయి. దీంతో ఇంజిన్‌తో కొన్ని బోగీలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. గూడ్స్ రైలు బోగీల మధ్య క్లిప్ ఊడిపోవడంతో గూడ్స్‌ రైలు రెండుగా విడిపోయింది…గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. గూడ్స్ రైలును నిలిపివేసి మరమ్మతులు నిర్వహించారు. సుమారు అరగంట సేపు రైలు నిలిచిపోయింది. గూడ్స్ బోగీలు విడిపోయిన ఘటనను అధికారులు, సిబ్బంది వెంటనే గుర్తించి స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది.YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ :  Perni Nani-pawan kalyan: పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన పేర్ని నాని..(లైవ్ వీడియో)

Bigg Boss 5 Telugu: షణ్ను నోటి దూల తీర్చిన నాగ్..! | అందర్నీ ఉతికిపారేసిన పవన్‌..(లైవ్ వీడియో)

 Cyclone Gulab Live Video: దూసుకొస్తున్న గులాబ్‌ తుఫాన్.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..(లైవ్ వీడియో)

 women MP’s in Araku video: రోకలి దంచుతూ..వనదేవతకు పూజలు చేస్తూ.. తిరగలి తిప్పిన మహిళా ఎంపీలు..(వీడియో)