అతని పేరు హ్యాపీ.. కానీ అతనకు లేనిదే అది.!!

Updated on: Apr 04, 2025 | 7:29 PM

పుట్టిన బిడ్డకు స్కూల్లో ఓ పేరు, ఇంట్లో ప్రేమగా పిలుచుకోవడానికి మరో పేరు పెడతారు తల్లిదండ్రులు. స్కూల్లో పేరు కొత్తగా ఉండాలనుకుంటారు. ఓ తల్లి తన కుమారుడికి పుట్టగానే సంతోషంతో ‘హ్యాపీ’ అని పెట్టేసింది. తన కుమారుడు ఆ పేరుతో జీవితమంతా సంతోషంగా ఉండాలనుకుంది. కానీ, అదే అతడికి శాపంగా మారింది.

ఆ పేరు వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. తనకు తగిన ఉద్యోగం దొరకట్లేదు.. ప్రేమ విఫలమైంది. ఇలాంటి ఘటనలతో అతడి జీవితంలో సంతోషమే కరవైంది. జపాన్‌కు చెందిన 27 ఏళ్ల ‘తెరవుచి హ్యపీ’ గాథ ఇది! ఇంట్లో ఆ పేరు ముద్దుగానే అనిపించినా స్కూల్‌, కాలేజీలో తోటి విద్యార్థులు గేలి చేసేవారు. ‘నిన్ను ఎంత ఎగతాళి చేసినా నువ్వు హ్యాపీగానే ఉంటావ్‌ కదా?’ అనేవారట. ఎవరిదైనా పుట్టిన రోజు వచ్చినా.. ‘హ్యపీ బర్త్‌డే’ చెప్పేముందు ఇతన్నే చూసేవారట. ఈ గేలిని భరించలేక పేరు మార్చుకుందామనుకున్నాడు. కానీ, తల్లి ఎంతో ప్రేమతో పెట్టిన పేరు కదా అని ఆ ఆలోచనను విరమించుకున్నాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగ వేటలో పడ్డ హ్యాపీకి తిరస్కరణలే ఎదురయ్యాయి. చాలా కంపెనీలు రెజ్యూమెలో అతడి పేరు చూసి ఎవరో జోక్‌ చేస్తున్నట్లు ఉన్నారని అప్లికేషన్‌ను రిజెక్ట్‌ చేసేవారు. కొందరు ఇంటర్వ్యూకి పిలిచి తన గుర్తింపు కార్డులను చూసి గానీ నమ్మేవారు కాదట. తన చదువుకు తగ్గ ఉద్యోగాలేవీ రాకపోవడంతో ఎంతో నిరాశకు గురయ్యాడు. చివరికి ఓ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌ ఉద్యోగం దొరకడంతో మరో దారిలేక అందులోనే చేరిపోయాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై దోమలు మనిషిపై వాలాలంటేనే భయపడతాయి.. కారణాలు ఇవే

కారులో వెళ్తున్న యువకులకు షాక్.. కారుపై కనిపించిన ఆకారాన్ని చూసి..

గజరాజు నడిస్తే.. గజ్జికుక్కలు అరుస్తాయి..

47 ఏళ్ల వయసులో.. తండ్రి కాబోతున్న కమెడియన్

లిప్‌ లాక్ సీన్ ఉందని.. నితిన్ సినిమాను రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్‌

Published on: Apr 04, 2025 04:49 PM