Loading video

ATM Steal: ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారు.! చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్‌..! వీడియో వైరల్.

|

Oct 13, 2023 | 4:50 PM

కొందరు దొంగలు ఓ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లాలనుకున్నారు. ఇంతలో ఇదంతా గమనించిన స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ మిగతావారిని అలర్ట్‌ చేసారు. దాంతో బెంబేలెత్తిపోయిన దొంగలు చెప్పులు చేతపట్టుకొని పరుగులంఖించుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలం అంక్సాపూర్‌లో చోటు చేసుకుంది.

కొందరు దొంగలు ఓ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లాలనుకున్నారు. ఇంతలో ఇదంతా గమనించిన స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ మిగతావారిని అలర్ట్‌ చేసారు. దాంతో బెంబేలెత్తిపోయిన దొంగలు చెప్పులు చేతపట్టుకొని పరుగులంఖించుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలం అంక్సాపూర్‌లో చోటు చేసుకుంది. అంక్సాపూర్‌లో గల యూనియన్ బ్యాంక్ ఏటీఎంను పగలగొట్టి నగదు చోరీ చేయాలనుకున్నారు కొందరు దొంగలు. ఎంత ప్రయత్నించినా నగదు బయటకు వచ్చేమార్గం దొరకలేదు. దాంతో విసిగిపోయిన దొంగలు ఏకంగా ఏటీఎం మెషీన్‌నే ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో కొందరు స్థానికులు ఆ చోరీని గమనించారు. పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వేయడంతో దొంగలు బెదిరిపోయారు. ఏటీఎం మెషీన్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో వచ్చి క్లూస్ సేకరించారు. ఏటీఎం మెషీన్‌లో సుమారు 40 లక్షల రూపాయలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా జిల్లాలో గత 15 రోజుల్లో ఏటీఎంలలో చోరీలకు పాల్పడటం ఇది మూడోసారి అని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు పక్కన, సెక్యూరిటీ లేని, జన సంచారం పెద్దగా లేని ఏటీఎం కేంద్రాలే టార్గెట్‌గా కేటుగాళ్లు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..