Flight in water: రన్‌వేపైనుంచి సరస్సులోకి దూసుకెళ్లిన విమానం.. ఎయిర్‌పోర్ట్‌ మూసివేసిన అధికారులు..

Updated on: Nov 27, 2022 | 10:02 AM

దక్షిణ ఫ్రాన్స్‌లోని మోంట్‌పిల్లర్‌ ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన బోయింగ్‌ 737 విమానం రన్‌వే దాటుకుని సపమీపంలోని సరస్సులోకి దూసుకెళ్లింది.


దక్షిణ ఫ్రాన్స్‌లోని మోంట్‌పిల్లర్‌ ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన బోయింగ్‌ 737 విమానం రన్‌వే దాటుకుని సపమీపంలోని సరస్సులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. కాగా ఇది ఓ సరకు రవాణా విమానం. ఈ ప్రమాదంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని అక్కడినుంచి తొలిగంచే వరకు ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. విమానం నేనుగా సరస్సులోకి దూసుకెళ్లడంతో ఒక ఇంజిన్‌ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. సెప్టెంబర్‌ 24 తెల్లవారుజామున పారిస్‌ ఛార్లెస్‌ డీ గౌల్లే ఎయిర్‌పోర్ట్‌ నుంచి మోంట్‌పిల్లర్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన క్రమంలోఈ ప్రమాదం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Nov 27, 2022 08:57 AM