Viral Video: ఇండియాలో ఒకే ఒక బౌద్ధ మమ్మీ.. 500 ఏళ్లుగా చెక్కు చెదరని మృతదేహం..!

|

May 13, 2022 | 9:03 PM

హిమాచల్ ప్రదేశ్‌లో స్పిటీ వ్యాలీలో ఓ మమ్మీ ఉంది. చాలా వరకూ మమ్మీలు పడుకున్న భంగిమలోనే ఉంటాయి. కానీ ఈ మమ్మీ మాత్రం కూర్చున్న భంగిమలో ఉంటుంది.ఈ మమ్మీ..

YouTube video player
హిమాచల్ ప్రదేశ్‌లో స్పిటీ వ్యాలీలో ఓ మమ్మీ ఉంది. చాలా వరకూ మమ్మీలు పడుకున్న భంగిమలోనే ఉంటాయి. కానీ ఈ మమ్మీ మాత్రం కూర్చున్న భంగిమలో ఉంటుంది.ఈ మమ్మీ.. బౌద్ధ గురువు సంఘ టెన్‌జిన్‌ది అని చెబుతారు. సంఘ టెన్‌జిన్ 15వ శతాబ్దానికి చెందినవారు. ఊరి క్షేమం కోసం ఆయన ప్రాణాలు అర్పించారని చెబుతారు. గ్రామంలోకి కుప్పలు తెప్పలుగా తేళ్లు రావడంతో.. వాటి బారి నుంచి ఊరిని కాపాడటం కోసం ఆయన ప్రాణ త్యాగం చేశారట. ఈ సాధువు ఆత్మ శరీరాన్ని వీడాక.. గ్రామస్థులకు ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించిందట. ఆ వెంటనే తేళ్ల గుంపు మాయమైందట. స్థానికులు ఇప్పటికీ సంఘ టెన్‌జిన్‌ను దైవంగా భావిస్తారు.ఇలా మమ్మీలుగా మారడం కోసం బౌద్ధ సాధువులు తమను తాము ముందుగానే సిద్ధం చేసుకుంటారు. కొన్ని రకాల చెట్లకు సంబంధించిన వేర్లు, దుంపలు తినడం ద్వారా వారి శరీరంలో తేమ లేకుండా చూసుకుంటారట. ఇలా చేయడం ద్వారా వారు చనిపోయిన తర్వాత కూడా శరీరం పాడైపోకుండా సహజసిద్దంగానే పరిరక్షింపబడుతుందట. ఇలా శరీరాన్ని మమ్మీగా మార్చుకునే ప్రక్రియను బౌద్ధంలో సోకుషినబత్సు అని పిలుస్తారు. 1975లో వచ్చిన భూకంపం కారణంగా ఈ బౌద్ధ సాధువు శరీరాన్ని ఉంచిన సమాధి పై కప్పు తెరుచుకుంది. దీంతో బౌద్ధ సాధువు మమ్మీ బయటపడింది. ప్రస్తుతం ఈ మమ్మీని గుయ్ టెంపులోని ఓ గాజు పెట్టెలో సందర్శన కోసం ఉంచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 13, 2022 09:03 PM