నడవలేని భార్యను రిక్షాలో కూర్చోబెట్టి తోసుకుంటూ వృద్ధుడు.. ఈ ఏజ్‌లో ఆ ప్రేమ చూసి మెచ్చుకుంటున్న నెటిజన్లు..
యూపీలో ఎన్నికల చివరిదశ పోలింగ్ కొనసాగుతోంది. 54 నియోజకవర్గాల్లో జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 613 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. నడవలేని వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి ఆసక్తి చూపుతున్నారు.
యూపీలో ఎన్నికల చివరిదశ పోలింగ్ కొనసాగుతోంది. 54 నియోజకవర్గాల్లో జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 613 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. నడవలేని వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓ వృద్ధుడు తన భార్యను రిక్షాలో తీసుకురావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అజంగఢ్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి ఓ వృద్ధుడు తన భార్యను రిక్షాలో కూర్చోబెట్టుకొని, స్వయంగా రిక్షాను తోసుకుంటూ తీసుకు వచ్చాడు. తన భార్య అంగవైకల్యంతో బాధపడుతోందని, తనకు కూడా వెన్నెముక సమస్య తో బాధపడుతున్నానని చెప్పాడు ఆ పెద్దాయన. ఓటు విలువ తెలిసిన వ్యక్తిగా నడవలేని స్థితిలో ఉన్న తనభార్యతో సహా ఓటు వేసేందుకు వచ్చానని తెలిపాడు. మరోవైపు ప్రభుత్వం ఇస్తోన్న 1,000 రూపాయల పెన్షను తమ మందులకే సరిపోవట్లేవని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..