ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న డోంట్ మిస్ వీడియో
సెప్టెంబర్ 7న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆరోజు సపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు చంద్రుడు రోజూకంటే పూర్తి భిన్నంగా కనిపించనున్నాడు. నారింజ వర్ణంలో ప్రకాశిస్తూ కనిపించే ఈ చంద్రుడిని బ్లడ్ మూన్ అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా చంద్రుడు రంగు భిన్నంగా కనిపించనున్నాడు. దాదాపు 82 నిమిషాల పాటు ఈ బ్లడ్ మూన్ ఆకాశంలో కనువిందు చేయనుంది.
సెప్టెంబర్ 7న సంభవించే ఈ చంద్ర గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. భారత్‌లోని ప్రజలు కూడా ఈ ఖగోళ అద్భుతాన్ని చూడవచ్చు. వాతావరణం అనుకూలించి, ఆకాశం నిర్మలంగా ఉంటే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా,పూణే, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల నుంచి ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. ఇటీవలి కాలంలో ఇంత ఎక్కువ సమయం కనిపించే చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. సూర్యుడికి, చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పూర్తిగా పడుతుంది. ఈ సమయంలో సూర్యుని కాంతి భూమి వాతావరణం గుండా ప్రయాణించి, వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలి రంగు కాంతి వాతావరణంలో కలిసిపోతుంది. కేవలం ఎరుపు, నారింజ రంగుల కాంతి కిరణాలు మాత్రమే చంద్రుడిని చేరతాయి. దీనివల్ల చంద్రుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో దర్శనమిస్తాడు. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :