Monkey Weeps: రోజూ అన్నం పెట్టే వ్యక్తి చనిపోయాడని వానరం కంటతడి.. వీడియో వైరల్.

Updated on: Sep 13, 2023 | 7:36 PM

అన్నం పెట్టినవారినే ఏమార్చే విశ్వాస ఘాతకులను మనం చూస్తున్నాం. మానవత్వానికే మాయని మచ్చగా మారుతోన్న అనేక సంఘటనలు జరుగుతున్న ఈ రోజుల్లో తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని ఓ వానరం రోదించి అతడికి నివాళులర్పించిన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి జిల్లాలో ఓ కోతి చూపిన విశ్వాసం చర్చనీయాంశంగా మారింది.

అన్నం పెట్టినవారినే ఏమార్చే విశ్వాస ఘాతకులను మనం చూస్తున్నాం. మానవత్వానికే మాయని మచ్చగా మారుతోన్న అనేక సంఘటనలు జరుగుతున్న ఈ రోజుల్లో తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని ఓ వానరం రోదించి అతడికి నివాళులర్పించిన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి జిల్లాలో ఓ కోతి చూపిన విశ్వాసం చర్చనీయాంశంగా మారింది. భీరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోంధియా గ్రామానికి చెందిన చందన్‌వర్మ అనే రైతుకు ఊరి శివార్లలో పొలం ఉంది. రోజూ పొలం వద్ద భోజనం చేసే సమయంలో ఓ కోతి చందన్‌ దగ్గరకు వచ్చేది. ఆ ఆహారంలో నుంచే కొంత కోతికి పెట్టేవాడు. ఇది నిత్యకృత్యంగా మారడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇటీవల పక్షవాతం బారినపడ్డ చందన్‌ శనివారం మృతిచెందాడు. బంధువులంతా అతడి ఇంటికి చేరుకున్నారు. ఇంతలో ఆ కోతి.. కూడా రైతు ఇంటికి వచ్చింది. చందన్‌ మృతదేహంపై కప్పి ఉన్న దుప్పటి తీసి అతణ్ని చూసి కంటతడి పెట్టింది. కోతిని చూసి మొదట భయపడ్డ జనం అది ఎవరిపైనా దాడి చేయకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. చందన్‌ అంత్యక్రియలు పూర్తయ్యేవరకు కోతి అక్కడే ఉండిపోయింది. ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..