యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్‌!

Updated on: Jan 17, 2026 | 9:13 AM

కంటికి నిద్ర ఉంటేనే ఒంటికి ఆరోగ్యం అంటారు. సమతుల్య ఆహారంతో పాటు, నిద్ర కూడా చాలా ముఖ్యం. సరిగ్గా నిద్రలేకపోతే అది శరీరం, మనసును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కానీ, ఓ వ్యక్తి మాత్రం వైద్య ప్రపంచానికి ఒక సవాలుగా మారాడు. ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 50 ఏళ్లుగా కంటి మీద కునుకు లేదట. ఒక మనిషి ఇన్ని సంవత్సరాలు నిద్రపోకుండా ఎలా జీవించగలడనే ప్రశ్నకు వైద్యులకు కూడా జవాబు చిక్కడం లేదు. ఈ ఆశ్చర్యకరమైన కేసు మధ్యప్రదేశ్‌లోని రేవాలో వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలోని చాణుక్యపురి కాలనీ నివాసి ఇతడు. పేరు మోహన్‌లాల్‌ ద్వివేది. అతను నిద్రపోకుండా బతికే ఉన్నాడని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రాత్రంతా నిద్రపోలేనని అతను ఎవరితోనూ చెప్పలేదు. అయితే, అతని కళ్ళు మండడం లేదు, అది అతని పనిని ప్రభావితం చేయలేదు. దీని గురించి అతను తన కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు, వారు మొదట అతనికి భూతవైద్యం చేయించారు. అవేవీ పని చేయకపోవడంతో అతను ఢిల్లీ, ముంబైలోని ప్రముఖ ఆసుపత్రులలోని వైద్యులను సంప్రదించాడు. అన్ని రకాల టెస్ట్‌లు చేసిన డాక్టర్లకు కూడా అతని నిద్రలేమికి కారణం మాత్రం కనిపెట్టలేకపోయారు.