Last Road in India: ఇండియాలో చిట్టచివరి రోడ్డు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

|

Aug 05, 2022 | 8:49 AM

మనం భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ.. ఈ దేశం గురించి మనకు పూర్తిగా తెలియదు. ఇండియా భౌగోళికంగా ప్రపంచంలో ఏడో అతిపెద్ద దేశం కాగా, జనాభా పరంగా


మనం భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ.. ఈ దేశం గురించి మనకు పూర్తిగా తెలియదు. ఇండియా భౌగోళికంగా ప్రపంచంలో ఏడో అతిపెద్ద దేశం కాగా, జనాభా పరంగా చైనా తర్వాత రెండో స్థానంలో ఉందన్న విషయం మాత్రం తెలుసు. అయితే దేశంలో నివసించే ప్రజలకు తెలియని దేశానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. దేశంలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉంది. కానీ భారతదేశంలోని చివరి రహదారి ఎక్కడ ఉందో, అది ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఆశ్చర్యం కలిగిస్తాయి. దేశంలోని చివరి రహదారి ధనుష్కోడి అని పిలువబడే తమిళనాడులోని నిర్జన గ్రామంలో ఉంది. ఈ గ్రామం భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న భూ సంబంధమైన సరిహద్దు. ఇది పాక్ జలసంధిలో ఇసుక దిబ్బపై ఉంటుంది. ఈ గ్రామం భారతదేశంలోని చివరి భూమిగా పిలువబడుతోంది. కాగా.. ఈ రోడ్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో రోడ్లు, దాని పరిసరాలు చాలా అందంగా కనిపిస్తాయి. డ్రోన్ ద్వారా చూస్తే ఒక పెద్ద శివలింగంలా కనిపిస్తుంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన కేవలం 15 సెకన్ల ఈ వీడియోకి ఇప్పటివరకు 3 లక్షల 46 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది ప్రజలు వీడియోను లైక్ చేసి కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 05, 2022 08:49 AM