పిల్లలకు పచ్చి క్యాబేజ్ తినిపిస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
పచ్చి క్యాబేజీ తినడం వల్ల టేనియా సోలియం గుడ్లు మెదడులోకి చేరి న్యూరోసిస్టోసెరోకోసిస్ అనే ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది మూర్ఛకు ఒక కారణం కావచ్చని ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ తెలిపారు. మూర్ఛ వారసత్వంగా కూడా రావచ్చని, సకాలంలో చికిత్స అందించడం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
మూర్ఛ అనేది మెదడు పనితీరులో ఆటంకం వల్ల సంభవించే ఒక వ్యాధి. ఫిట్స్ వచ్చినప్పుడు అవయవాలు వణకడం, ఆకస్మికంగా పడిపోవడం, తదేకంగా చూడటం, ఆందోళన, స్పృహ కోల్పోవడం, సైకోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ఏ వయసులోనైనా రావచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు. మూర్ఛ రావడానికి అనేక కారణాలు ఉండగా, ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఆహారం ద్వారా మెదడులోకి చేరే పురుగులు కూడా ఒక ప్రధాన కారణంగా మారుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
