Tiger attack: అమ్మో..! జస్ట్‌ కారు దిగింది.. అమాంతం అమ్మాయిని ఎత్తకెళ్లిన పులి..! వీడియో

Tiger attack: అమ్మో..! జస్ట్‌ కారు దిగింది.. అమాంతం అమ్మాయిని ఎత్తకెళ్లిన పులి..! వీడియో

Anil kumar poka

|

Updated on: Feb 22, 2023 | 8:55 PM

క్రూర మృగాలు దాడులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అడవిలో జంతువుల వేటా ఎంతలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడొక పెద్ద పులి భలే

క్రూర మృగాలు దాడులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అడవిలో జంతువుల వేటా ఎంతలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడొక పెద్ద పులి భలే కామ్‌గా వచ్చి లటుక్కున మహిళను పట్టుకుపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చైనా రాజధాని బీజింగ్ యాంక్వింగ్ జిల్లా గ్రేట్ వాల్‌కు సమీపంలోని సఫారీ పార్కులో తెల్ల పులులుంటాయి. కారు నుంచి దిగకూడదు. కారులో కూర్చునే జూలో తిరగాడాలనే నియమం ఉంది. అయితే అప్పటికే పార్కు నుంచి ఓ పులి తప్పించుకుంది. అక్కడి పార్క్ సిబ్బంది, అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి… కారు ఆపి డ్రైవింగ్ చేసే వైపు నుంచి మారడానికి దిగి మరో డోర్ తెరిచింది. అంతే ఇంతలోనే ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగానే ఆ మహిళను అడవిలోకి ఏదో బొమ్మను లాక్కెళ్లినట్లు లాక్కుపోయింది. అంతా ఒక్కక్షణంలో జరిగిపోయింది. కారులోని వారు తేరుకుని రక్షించే ఛాన్స్‌ కూడా లేకుండాపోయింది. కాపాడేందుకు వెళ్లిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ పార్కులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 22, 2023 08:55 PM