200 years Tree:ఎంత పని చేశావ్ బ్రో.. 200 ఏళ్ల వృక్షాన్ని నరికేస్తావా?
యూకేలో ప్రకృతి అందాలకు కేంద్రబిందువుగా నిలిచే 200 ఏళ్ల నాటి వృక్షాన్ని 16 ఏళ్ల టీన్ నరికేసాడు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి ప్రేమికుల్లో కలవరం రేపుతోంది. పోలీసులు ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. యూకేలోని సైకమోర్ గ్యాప్‌లో రెండు కొండల మధ్య ఒకే ఒక వృక్షం ఠీవీగా ఉన్న దృశ్యం మనం తరచూ ఇంటర్నెట్‌లో చూస్తుంటాం. ఈ ప్రదేశం బ్రిటన్‌లోని నార్తంబర్లాండ్‌లోని చారిత్రక హాండ్రియన్ వాల్ వద్ద ఉంది.
యూకేలో ప్రకృతి అందాలకు కేంద్రబిందువుగా నిలిచే 200 ఏళ్ల నాటి వృక్షాన్ని 16 ఏళ్ల టీన్ నరికేసాడు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి ప్రేమికుల్లో కలవరం రేపుతోంది. పోలీసులు ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. యూకేలోని సైకమోర్ గ్యాప్‌లో రెండు కొండల మధ్య ఒకే ఒక వృక్షం ఠీవీగా ఉన్న దృశ్యం మనం తరచూ ఇంటర్నెట్‌లో చూస్తుంటాం. ఈ ప్రదేశం బ్రిటన్‌లోని నార్తంబర్లాండ్‌లోని చారిత్రక హాండ్రియన్ వాల్ వద్ద ఉంది. ఈ వృక్షం వయసు 200 సంవత్సరాలు పైనే ఉంటుంది. 1900 సంవత్సరాల క్రితం రోమన్లు నిర్మించిన హాండ్రియన్ వాల్.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల జాబితాలో నిలిచింది. ‘రాబిన్ హుడ్: ప్రిన్స్ ఆఫ్ థీవ్స్’ చిత్రంలో కూడా ఇది కనిపిస్తుంది. సైకమోర్ గ్యాప్‌లోని ఈ వృక్షం ఉన్న ప్రాంతం ఇంగ్లాండ్‌లోనే అత్యధికంగా ఫొటోలు తీసిన ప్రదేశంగా నిలిచింది. దీనిని 2016లో ఇంగ్లిష్ ట్రీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశారు. ఈ ప్రాంతాన్ని నిర్వహిస్తున్న నేషనల్ ట్రస్ట్ హెరిటేజ్ ఛారిటీ సంస్థ మాత్రం చెట్టు నరికివేతపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటనలో పోలీసులు 16 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. అతడు ప్రస్తుతం విచారణకు సహకరిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. గత నెలలో చైనాలోని షాక్సి ప్రావిన్స్‌లో యూయు కౌంటీ వద్ద కొందరు షార్ట్‌కట్ దారి కోసం ఏకంగా గ్రేట్ వాల్‌ను తవ్వేశారు. తాము చేపట్టిన నిర్మాణ పనుల షార్ట్‌కట్ కోసం ఇలా చేశామని తర్వాత ఆ నిందితులు వెల్లడించారు. ఈ ఘటన మరిచిపోక ముందే.. మరో చారిత్రక ప్రదేశం విధ్వంసానికి గురైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..