Engineer to Farmer: ఇంజినీర్ గా ఉద్యోగం వదిలి పొలం బాటపట్టిన యువకుడు.. లాభాలబాటలో..
ఏలూరు జిల్లా కళ్ల చెరువుకు చెందిన పృథ్వీ బీటెక్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. కొన్నాళ్లు తన చదువుకు తగిన ఉద్యోగం చేశాడు. రైతు బిడ్డగా పుట్టిన అతనికి ఆ ఉద్యోగం తృప్తినివ్వలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి
ఏలూరు జిల్లా కళ్ల చెరువుకు చెందిన పృథ్వీ బీటెక్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. కొన్నాళ్లు తన చదువుకు తగిన ఉద్యోగం చేశాడు. రైతు బిడ్డగా పుట్టిన అతనికి ఆ ఉద్యోగం తృప్తినివ్వలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి స్వగ్రామానికి చేరుకున్నాడు. తండ్రితో పాటు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. సాగులో మెలకువలు తెలుసుకున్నాడు. ఇక వ్యవసాయమే తన ప్రధాన వృత్తిగా భావించాడు. తనకు ఎంతో ఇష్టమైన గులాబీలను సాగు వనరుగా ఎంచుకున్నాడు. తన పొలంలో రంగు రంగుల గులాబీలు పూయిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు.మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగం చేసినా తనకు సంతృప్తి కలగలేదని, అందుకే పూల సాగు వైపు వచ్చానంటున్నాడు పృధ్వీ. బెంగళూరులో పూల తోటలను పరిశీలించి… సొంతూరుకొచ్చి మెట్ట ప్రాంతంలో గులాబీ సాగును మొదలుపెట్టినట్టు చెప్పాడు. మొత్తం 15 ఎకరాల్లో గులాబీ సాగు చేస్తున్న పృధ్వీకి మంచి ఆదాయమే వస్తోంది. రోజు విడిచి రోజు ఎకరానికి 40 కేజీల దిగుబడి వస్తుందని, కిలో గులాబీలకు మినిమం 80 రూపాయలు ధర వస్తున్నట్లు చెబుతున్నాడు పృధ్వీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!