Elephant Viral Video: లైవ్‌లో రిపోర్టర్‌కు చక్కిలిగింతలు పెట్టిన గున్న ఏనుగు..! వైరల్ అవుతున్న ఏనుగు వీడియో.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇవి నెటిజన్లను నవ్వించడంతోపాటు.. వారి హృదయాలను ఆకట్టుకుంటుంటాయి. అయితే.. కొన్ని సార్లు జంతువులు ప్రవర్తన భలే విచిత్రంగా ఉంటుంది. అవి చేసే పనులు చూస్తే అందరికీ నవ్వొస్తుంది. కొన్ని జంతువుల ప్రవర్తన అచ్చం మనుషుల్లానే ఉంటుంది. తాజాగా.. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెన్యాలోని నైరోబీలోని షెల్‌డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ లో KBC జర్నలిస్ట్ ఏనుగుల గుంపు వద్ద నిలబడి.. రిపోర్టింగ్ చేస్తుంటాడు. ఈ సయమంలో ఓ ఏనుగు పిల్ల తన తొండెంతో రిపోర్టర్‌ను చక్కిలిగింతలు పెడుతూ ఆటపట్టించింది. వైరల్ అవుతోన్న వీడియోలో ఈ ఏనుగు పిల్ల చేసిన పని ఇప్పుడు అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇది చూసి అందరూ నవ్వుకోవడంతోపాటు.. పలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..