World Oldest Dog: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం మృతి.. 31 ఏళ్ల 165 రోజుల వయస్సు.

|

Oct 24, 2023 | 9:22 PM

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బోబీ చనిపోయింది. 31 సంవత్సరాల 165 రోజుల వయసులో అది మరణించింది. 11 మే 1992లో జన్మించిన బోబీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక కాలం జీవించిన శునకంగా గుర్తింపు పొందింది. రఫీరో డో అలెంటెజో‌ బ్రీడ్‌కు చెందిన ఈ శునకం అక్టోబరు 21న పోర్చుగల్‌లోని తాను నివాసముంటున్న ఇంట్లోనే చనిపోయింది.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బోబీ చనిపోయింది. 31 సంవత్సరాల 165 రోజుల వయసులో అది మరణించింది. 11 మే 1992లో జన్మించిన బోబీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక కాలం జీవించిన శునకంగా గుర్తింపు పొందింది. రఫీరో డో అలెంటెజో‌ బ్రీడ్‌కు చెందిన ఈ శునకం అక్టోబరు 21న పోర్చుగల్‌లోని తాను నివాసముంటున్న ఇంట్లోనే చనిపోయింది. బోబీని పరీక్షించిన పశు వైద్యుడు కరెన్ బెకర్ ఈ స్వీట్ బాయ్ శనివారం రాత్రి నింగికి ఎగిశాడు అంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటించారు. బోబీ తన జీవితమంతా ఒకే కుటుంబంతో గడపడం విశేషం. భూమిపై అన్ని శునకాల కంటే ఎక్కువ కాలమే జీవించినప్పటికీ.. బోబీని అమితంగా ఇష్టపడేవారికి 11,478 రోజులు సరిపోవు అంటూ డాక్టర్ కరెన్ ఎమోషనల్‌గా స్పందించారు. కాగా బోబీ కంటే ముందు 1939లో ఆస్ట్రేలియాకు చెందిన బ్లాయ్ అనే శునకం 29 సంవత్సరాల 5 నెలల వయసులో మరణించింది. అప్పటివరకు అదే అతిపెద్ద వయసున్న శునకంగా గుర్తింపు పొందింది. ఆ రికార్డును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బోబీ అధిగమించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..