Doctor: అద్భుతం.. చనిపోయిందనుకున్న పాపకు ప్రాణం పోసిన డాక్టర్‌.. జేజేలు పలుకుతున్న నెటిజన్లు.

|

Sep 29, 2022 | 9:29 PM

‘వైద్యో నారాయణో హరిః’ అంటారు. వైద్యులు ఆ భగవంతుడితో సమానం అని అర్థం. ఎందుకంటే ప్రాణం పోసేది భగవంతుడు అయితే.. ఆ ప్రాణాలను కాపాడే శక్తి ఒక్క డాక్టర్‌కే ఉంటుంది.


‘వైద్యో నారాయణో హరిః’ అంటారు. వైద్యులు ఆ భగవంతుడితో సమానం అని అర్థం. ఎందుకంటే ప్రాణం పోసేది భగవంతుడు అయితే.. ఆ ప్రాణాలను కాపాడే శక్తి ఒక్క డాక్టర్‌కే ఉంటుంది. ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడితే.. ఆ వైద్యులను బాధిత వ్యక్తులు దేవుడికంటే ఎక్కువగా కొలుస్తారు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఊపిరి ఆగిపోయిందనుకున్న శిశువుకు ఓ వైద్యురాలు తన ఊపిరి ఊది ప్రాణం పోసింది. అవును, ఓ గర్భిణీ ప్రసవం చేసి బిడ్డను బయటకు తీశారు వైద్యులు. అయితే, ఆ చిన్నారి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆ శిశువు ఉలుకుపలుకు లేకుండా మిన్నకుండిపోయింది. ఊపిరి కూడా తీసుకోవడం లేదు. దాంతో అలర్ట్ అయిన ఓ వైద్యురాలు.. వెంటనే ఆ శిశువుకు సీపీఆర్ చేసింది. పసిపాప నోటి ద్వారా గాలి ఊది ఊపిరి అందించారు. వెనక్కి తిప్పి వీపుపై కొడుతూ గుండె కొట్టుకునేలా చేశారు. చివరకు ఆ డాక్టర్‌ ప్రయత్నాలు ఫలించాయి. శిశువు ఊపిరి తీసుకుంది. గుండె కొట్టుకుంది. కేర్‌మంటూ సందడి చేసింది. మొత్తానికి చిన్నారి ప్రాణాలు నిలవడంతో.. ప్రాణం పోసిన వైద్యురాలు సహా అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. పసిపాప ప్రాణాలు కాపాడిన వైద్యురాలికి ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వైద్యురాలిని ప్రాణం పోసిన దేవతగా పోలుస్తూ కీర్తిస్తున్నారు. ‘వైద్యో నారాయణో హరిః’ అన్న దానికి నిదర్శనంగా నిలిచారని కొనియాడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on