Bride Viral Video: స్టేజిపైకి వస్తూ ఇబ్బందిపడ్డ పెళ్లికూతురు.. వరుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!(వీడియో)

|

Dec 06, 2021 | 9:58 AM

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ వివాహాల్లో జరిగే విచిత్ర సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిని నెటిజన్లు కూడా చాలా ఎంజాయ్‌ చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోంది.


సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ వివాహాల్లో జరిగే విచిత్ర సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిని నెటిజన్లు కూడా చాలా ఎంజాయ్‌ చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోంది. వేదికపైకి రావడానికి ఇబ్బంది పడుతున్న వధువుకు వరుడు సహాయం చేసాడు. పెళ్లికొడుకు చేసిన ఈ పనితో బంధువుల హృదయాలు గెలుచుకోవడమేకాదు.. నెటిజన్ల ప్రసంశలనూ అందుకున్నాడు. ఈ వీడియోచూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వధూవరులు పెళ్లి వేదికపైకి ఎక్కుతున్న నమయంలో వధువు లెహంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని వరుడు గమనించాడు. వెంటనే స్పందించాడు. వధువుకు సహాయం చేస్తూ.. లెహంగాను హ్యాండిల్ చేస్తూ చేతితో సరిచేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో సోషల్ మీడియా లో ‘witty_wedding’ అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లు విపరీతంగా లైక్‌ చేస్తున్నారు. ‘ఇది చాలా మనోహరమైన క్షణం’అని కొందరంటే.. ‘సో క్యూట్’ ఎంత మనోహరమైన దృశ్యం ‘, అమ్మాయి చాలా అదృష్టవంతురాలు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వరుడిపై ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు.