Boyfriend-Girlfriend: యువకుడిని వెంటాడిన మృత్యువు ప్రేయసిని చంపి పారిపోతుండగా యాక్సిడెంట్‌..

|

Oct 06, 2022 | 8:06 PM

మృత్యువునుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు అనడానికి ఉదాహరణ ఈ ఇన్సిడెంట్‌. ఒకసారి చావు నుంచి బయటపడి పారిపోతుండగా మరో సారి మృత్యువు విరుచుకుపడింది.


మృత్యువునుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు అనడానికి ఉదాహరణ ఈ ఇన్సిడెంట్‌. ఒకసారి చావు నుంచి బయటపడి పారిపోతుండగా మరో సారి మృత్యువు విరుచుకుపడింది. ఈ సారి అతను ఓడిపోక తప్పలేదు. మాటా మాటా పెరిగి ప్రియురాలిని హత్య చేసిన ఓ యువకుడు.. పారిపోతూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాకు చెందిన కృష్ణయాదవ్‌.. నేహా అనే యువతిని ప్రేమించాడు. కొన్నాళ్లు వారి ప్రేమాయణం సజావుగానే సాగింది. ఈక్రమంలో వారిద్దరూ మాట్లాడుకునేందుకు బోయిసర్‌లోని రైల్వే ఫ్లైఓవర్‌ కిందకు వచ్చారు. సరదాగా మొదలైన వారి సంభాషణ మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన కృష్ణ యాదవ్.. యువతిపై తుపాకీ గురి పెట్టాడు. అంతటితో ఆగకుండా తలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.యువతి చనిపోవడంతో కృష్ణ భయాందోళనకు గురయ్యాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తాడు. ముందూ వెనకా చూసుకోకుండా వెళ్లడంతో రోడ్డుపై వేగంగా వస్తున్న కారు.. అతన్ని ఢీకొట్టింది. శక్తిని కూడదీసుకుని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగెత్తేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ సారి మాత్రం అతను తప్పించుకోలేకపోయాడు. ఆర్మీకి చెందిన ఓ ట్రక్కు ఎదురుగా వచ్చి అతడిని ఢీ కొట్టింది. ఈ రెండు ఘటనల్లో కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షిస్తుండగా ఆస్పత్రిలోనే కృష్ణ ప్రాణాలు కోల్పోయాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 06, 2022 08:06 PM