Tesla: కారులో కస్టమర్ల రాసలీలలు.. సీక్రెట్ గా డేటాను అమ్మేస్తున్న టెస్లా కంపెనీ..

|

Sep 09, 2023 | 7:49 PM

క్రమంగా వాహనాలన్నీ డిజిటల్‌మయంగా మారుతున్న తరుణంలో వ్యక్తుల సమాచార గోప్యతపై ఓ ప్రముఖ సంస్థ ఆందోళనకర విషయాలు బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్ల కార్లలో కస్టమర్ల ప్రైవసీ ఓ కలగానే మారిందని పేర్కొంది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న మొజిల్లా ఫౌండేషన్‌ 25 ప్రముఖ కార్ల బ్రాండ్‌లను అధ్యయనం చేసింది. వినియోగదారుల ప్రైవసీ విషయంలో ఒక్క కంపెనీ కూడా సంతృప్తకరమైన ప్రమాణాలు పాటించడం లేదని స్పష్టం చేసింది.

క్రమంగా వాహనాలన్నీ డిజిటల్‌మయంగా మారుతున్న తరుణంలో వ్యక్తుల సమాచార గోప్యతపై ఓ ప్రముఖ సంస్థ ఆందోళనకర విషయాలు బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్ల కార్లలో కస్టమర్ల ప్రైవసీ ఓ కలగానే మారిందని పేర్కొంది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న మొజిల్లా ఫౌండేషన్‌ 25 ప్రముఖ కార్ల బ్రాండ్‌లను అధ్యయనం చేసింది. వినియోగదారుల ప్రైవసీ విషయంలో ఒక్క కంపెనీ కూడా సంతృప్తకరమైన ప్రమాణాలు పాటించడం లేదని స్పష్టం చేసింది. ‘‘ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయ్యే గ్యాడ్జెట్లు మాత్రమే మనపై నిఘా వేసి ఉంచుతున్నాయని ఇప్పటి వరకు అనుకుంటున్నాం. కానీ, ప్రముఖ కార్ల బ్రాండ్లన్నీ నెమ్మదిగా సమాచారాన్ని సేకరించే యంత్రాలుగా మారి డేటా విక్రయ బిజినెస్‌లోకి ప్రవేశించాయి’’ అని మొజిల్లా తెలిపింది.

ఈ విషయంలో టెస్లా ముందుందని ఆరోపించింది. అయితే, వినియోగదారుల లైంగిక కార్యకలాపాలు సహా అత్యంత సున్నితమైన సమాచారాన్ని సైతం ఓ కంపెనీ సేకరించే ప్రయత్నం చేసినట్లుగా తాము గుర్తించామని వెల్లడించింది. 84 శాతం కార్‌ బ్రాండ్‌లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సర్వీస్‌ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు సహా ఇతర వ్యాపారులతో పంచుకునేందుకు అంగీకరించినట్లు మొజిల్లా అధ్యయనం వెల్లడించింది. వీటిలో 76 శాతం ఇప్పటికే కస్టమర్ల డేటాను అమ్మేసినట్లు తెలిపింది. మరికొన్ని కంపెనీలు ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలకు అవసరమైతేనే సమాచారాన్ని అందిస్తామని తెలిపినట్లు బయటపెట్టింది. కేవలం డ్రైవింగ్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే కాకుండా.. కారులోని ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యవస్థ, శాటిలైట్‌ రేడియో, మ్యాప్స్‌ వంటి వాటి నుంచి కార్ల సమాచారాన్ని సేకరిస్తున్నాయని తెలిపింది. మెజారిటీ బ్రాండ్లు తమ వినియోగదారులకు డేటాను నియంత్రించుకునే ఆప్షన్లను ఇవ్వడం లేదని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on