Perfume Bomb: రోడ్డుపై పడివున్న పెర్ఫ్యూమ్ బాటిల్.. ఓపెన్ చేయగానే బీభత్సం.. వీడియో వైరల్..
రోడ్డుమీద పడివున్న పెర్ఫ్యూమ్ బాటిల్ చూసిన ఓ వ్యక్తి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. బాటిల్ చూసేందుకు కొత్తగా, నిండుగా ఉండటంతో… వాసన ఏమిటో తెలుసుకోవాలని మూత తెరిచి చూశాడు.
రోడ్డుమీద పడివున్న పెర్ఫ్యూమ్ బాటిల్ చూసిన ఓ వ్యక్తి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. బాటిల్ చూసేందుకు కొత్తగా, నిండుగా ఉండటంతో… వాసన ఏమిటో తెలుసుకోవాలని మూత తెరిచి చూశాడు.. అంతే, పెర్ఫ్యూమ్ బాటిల్ ఒక్కసారిగా పేలిపోయింది. పెర్ఫ్యూమ్ బాటిల్ సృష్టించిన విధ్వంసానికి అక్కడి పరిసరాలు భయానకంగా మారాయి. ఈ దారుణ ఘటన జమ్మూ- కశ్మీర్‌లో చోటు చేసుకుంది. కాశ్మీర్‌లో భద్రతా బలగాలను పక్కదారి పట్టించేందుకు సరిహద్దు అవతలి నుంచి కొత్త మార్గాల ద్వారా ఇలాంటి ‘పెర్ఫ్యూమ్ బాంబ్’లను దిగుమతి చేసుకుంటున్నారు ఉగ్రమూకలు. ఘటనకు సంబంధించి..కశ్మీర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మారువేశంలో పనిచేస్తున్న మిలిటెంట్ ఆరిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి పెర్ఫ్యూమ్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. జనవరి 21న జమ్మూకశ్మీర్‌లోని నర్వాల్‌లో ఉగ్రవాదులు రెండు ఐఈడీలను పేల్చారు. ఈ పేలుడులో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేస్తుండగా ఆరీఫ్ దొరికాడు. పెర్ఫ్యూమ్ బాటిళ్లలో ప్యాక్ చేసిన ఐఈడీ పేలుడు పదార్థాల వల్లే జంట పేలుళ్లు సంభవించాయని దర్యాప్తులో తేలింది.పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఆరీఫ్‌తో సన్నిహితంగా మెలిగినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు డీజీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఆరిఫ్ నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందెన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని జమ్మూ-కశ్మీర్ పోలీస్ చీఫ్ చెప్పారు. దీనిని బట్టి కొత్త తరహాలో పేలుళ్లకు పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోందన్నారు. గత ఏడాది మే 24న వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఉందని విచారణలో ఆరిఫ్ ఒప్పుకున్నట్లు దిల్‌బాగ్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..