దొంగల్లో ఖతర్నాక్ దొంగ.. హుండీని ఎలా కొల్లగొట్టాడు చూడండి

Updated on: Oct 23, 2025 | 3:53 PM

సాధారణంగా జనాలు గుడికి ఎందుకు వెళ్తారు.? ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా..? తమ మొక్కులు తీర్చుకునేందుకు, కోరికున్నవి జరిగేందుకు దేవుడ్ని మొక్కేందుకు వెళ్తుంటారు జనాలు. కానీ ఇక్కడొక కేటుగాడు దొంగలించడానికే గుడికి వెళ్తాడు. దొంగ అంటే కచ్చితంగా కరుడుకట్టిన నేరస్తుడు అనేలా ఉంటాడు ఈ ప్రబుద్దుడు. ఇక అతడు చేసిన పని అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయింది.

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన చోరీ సీన్‌ ఇది. దొంగల్లో ఇట్టాంటి దొంగలే వేరయా! అనేలా సింపుల్‌గా ఇలా హుండీని కొల్లగొట్టాడు. చువ్వకు చివరన బబుల్‌ గమ్ అంటించాడు. గప్‌ చుప్‌గా నోట్లను లాగేశాడు. క్యాష్‌ పుల్లింగ్‌తో ప్యాకెట్‌ ఫుల్‌ అయ్యేది. ఎవరూ పసిగట్టకపోవడంతో ఇది రెగ్యూలర్‌ యాక్టివిటీగా చేసుకున్నాడు. భక్తుల నుంచి విరాళాలు వస్తున్నాయి.కానీ హుండీ ఓపెన్‌ చూస్తే క్యాష్‌ కన్పించడంలేదు. ఏ కాకులు వచ్చి ఎత్తుకెళ్తున్నాయ్‌..అని అర్ధంకాక గుడి సిబ్బంది తర్జనభర్జన పడ్డారు . సీసీటీవీ ఫుటేజీని తిరిగేస్తే ఇదిగో ఈ ఏకాకి బబుల్‌ గమ్‌ – చువ్వ చోరీ కథా చిత్రమ్‌ తళుక్కుమంది. చిల్లర కోసం ఈ చిల్లరోడేసిన ఈ ఐడియా హాట్‌టాపిక్‌ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీరు లాప్‌టాప్‌తో విమానాశ్రయానికి వెళుతున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

‘పని మనిషి చేతిలో మోసపోయా..’ ప్రసాద్ ఎమోషనల్‌

హాట్ సీన్లతో బ్యాన్ అయిన మూవీ.. OTTలో మాత్రం సూపర్ హిట్

అమ్మాయిలతో న్యూడ్ వీడియోకాల్…! తాను అలాంటి వాడిని కాదంటూ నటుడు ఎమోషనల్

Bigg Boss Telugu 9: ఆ ఇద్దరి పులిహోర పంచాయితీలో..ఎరక్కపోయి ఇరుక్కున్న రమ్య