రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత !! చలికి గజగజా వణుకుతున్న మూగజీవులు
తెలంగాణలో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం గజగజా వణికిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత దారుణంగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమురంభీం జిల్లా సిర్పూరులో రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదవుతుండంతో ఉదయం 10 గంటలు దాటినా జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
తెలంగాణలో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం గజగజా వణికిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత దారుణంగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమురంభీం జిల్లా సిర్పూరులో రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదవుతుండంతో ఉదయం 10 గంటలు దాటినా జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మనుషులే కాదు చలి తీవ్రతకు పశు పక్షాదులుకూడా అష్టకష్టాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటంతో.. ఈ ప్రాంతంలోని రైతులు పశువులను చలినుండికాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో తమకు బతుకునిస్తున్న పాడిపశువులను చలి బారినుండి రక్షణ కల్పించేందుకు రైతన్నలు ఆవులు, బసవన్నలకు తట్లు , బొంతలు కప్పి చలి నుండి ఉపశమనాన్ని అందిస్తున్నారు. భీంపూర్ మండలం అర్లీ గ్రామంలో పశువులు చలి తీవ్రతను మౌనంగా భరిస్తున్న మూగజీవులకు రక్షణ కల్పించేందుకు రైతులు వాటి పై తట్లు కప్పి చలి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: