వచ్చిందమ్మ మాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిందని సంబరాలు వీడియో
ఇంట్లో అమ్మాయి పుడితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అని సంతోషపడేవారు చాలా తక్కువగా ఉంటారు. అమ్మాయి కంటే అబ్బాయి పుట్టాలి అని చాలా మంది దేవుళ్ళకు ముక్కుతూ ఉంటారు. జనరేషన్స్ మారుతున్నా ఆడపిల్లను భారంగా చూసే రోజులు మారటం లేదు. మగపిల్లలు పుడితే వారసుడు వచ్చాడంటూ సంబరాలు జరుపుకుంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అబ్బాయిలు పుడితే అదేదో ప్రపంచాన్ని జయించినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మాయి కంటే అబ్బాయికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతుంది.
ఆడపిల్ల పుడితే తమ ఇంటికి ప్రిన్సెస్ వచ్చిందని భావించే మనుషులు తారసపడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆడ బిడ్డను అలానే ట్రీట్ చేసింది ఓ కుటుంబం. నర్సాపూర్ కు చెందిన కరుణాకర్ స్పందన దంపతులకు 27 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఇటీవల అమ్మమ్మగారి ఇంట్లో తొట్టెల కార్యక్రమం నిర్వహించారు. కాగా కరుణాకర్ నర్సాపూర్ లోని తన నివాసానికి పుట్టిన పాపను తీసుకువస్తుండగా బంధుమిత్రులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి పూలూ చల్లుతూ ఘనస్వాగతం పలికారు. తమ ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చిందని సంబరపడ్డారు. ఆడపిల్ల పుట్టగానే భారం అనుకొని విసరేసిన తల్లిదండ్రులను చూశాం. కడుపులో పెరుగుతున్న ఆడపిల్లలను తెలుసుకొని అబార్షన్లు చేయించే తల్లిదండ్రులను కూడా చూశాం. కానీ ఆడపిల్ల పుట్టిందని సంబరాలు జరుపుకుంటూ ఘనంగా స్వాగతించడం మాత్రం చాలా అరుదు. నిజంగా ఈ కుటుంబాన్ని అభినందించాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం :
పని చేద్దామని పొలంలోకి వెళ్లిన రైతు.. ఒక్కసారిగా షాక్ వీడియో