బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్‌

Updated on: Jun 15, 2025 | 12:17 PM

ఓ శ్రీమతి కోపం పతి ప్రాణాల మీదకు తెచ్చింది. అతన్ని ఫినిష్ చేసి దృశ్యం సినిమా తరహాలో కేసును తప్పదొవ పట్టిద్దామనుకున్నారు. కానీ భూమి మీద నూకలుండటంతో బావిలో నుంచి బయటపడ్డాడు. నిజం వెలుగు చూసింది. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.మచిలీపట్నం, కాలేకన్ పేటలో ప్రసాద్, ఉషారాణి జంట తమ ఇద్దరు పిల్లలతో ఎంతో ఆనందంగా ఉండేవారు. అయితే ప్రసాద్ తెల్లారేసరికి హఠాత్తుగా రక్తమడుగులో పడున్నాడు. ఉషారాణి ఆమె పిల్లల దుఃఖం కట్టలు తెగింది. తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అసలేం జరిగిందని ఆరా తీస్తే ఉషారాణి కన్నీరు పెడుతూ క్రైమ్ కథ చెప్పింది. నలుగురైదుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి అతనిపై దాడి చేశారని అడ్డుకోబోయిన తనను కూడా కొట్టారని సినిమా సీన్లు కళ్లకు కట్టినట్లు చెప్పింది ఆమె. అవును అవునవును అంటూ కొడుకు కూతురు కూడా తల్లికి వంతపడ్డారు. అయ్యో పాపమని జాలిపడ్డారంతా. ఇంకా నయం మీరు అడ్డుపడ్డారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ దుర్మార్గులు ప్రసాద్ ని చంపేసి ఉండేవారన్నారు తెలిసిన వారంతా. జనం తమ మాటలు నమ్మారని ప్లాన్ వర్క్ అవుట్ అయిందని సంతోషించారు. ప్రసాద్ బతికి బట్టకట్టే ప్రసక్తే లేదు. రేపోమాపో చాలీచాలని గాయాలంట అవడం ఖాయమనుకున్నారు. మరోవైపు దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ప్రసాద్ ఇంటివైపు దుండగులు వచ్చిన ఆనవాలు కనిపించలేదు. మరోసారి ఉషాను ఆమె పిల్లలను ప్రశ్నించారు పోలీసులు. ఖాకీలకు కూడా దృశ్యం సినిమా చూపించారు వాళ్ళు. ఎవరో వచ్చారు కొట్టారు అడ్డుకున్నాం పారిపోయారు జరిగింది ఇదేనంటూ లైన్ లెంత్ తప్పకుండా ముగ్గురు సేమ్ స్టోరీ చెప్పారు. వాళ్ళు చెప్పింది వింటే నిజమే అనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం :

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియో

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్‌ రా అయ్యా వీడియో