Water Falls in telangana: ఓ వైపు వరద బీభత్సం.. మరోవైపు పరవళ్లు తొక్కుతున్న వాటర్‌ ఫాల్స్‌.! చూడచక్కని అద్భుతం..

|

Jul 17, 2022 | 8:36 PM

ఒకవైపు వరదలు విలయం సృష్టిస్తుంటే, మరోవైపు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారుతూ పరవళ్లు తొక్కుతున్నాయ్‌.


ఒకవైపు వరదలు విలయం సృష్టిస్తుంటే, మరోవైపు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారుతూ పరవళ్లు తొక్కుతున్నాయ్‌. తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు వరద బీభత్సం సృష్టిస్తుంటే, మరోవైపు జలపాతాలు జలకళతో సవ్వడి చేస్తున్నాయ్‌. నయాగరా వాటర్‌ ఫాల్స్‌ను తలపిస్తూ అందంగా జాలువారుతున్నాయ్‌. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చర్ల జలపాతాలకు వరద నీరు పోటెత్తుతోంది. కొండల పైనుంచి ఉధృతంగా జాలువారుతోన్న నీటి ప్రవాహం కనువిందు చేస్తోంది. పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం నయగారాలను తలపిస్తోంది. దట్టమైన అడవిలో, చుట్టూ పచ్చని కొండల నడుమ వయ్యారంగా వంపులు తిరుగుతూ ఆకర్షణగా నిలుస్తోంది. భీమునిపాదం జాలువారుతోంది. చుక్క నీరు కూడా లేకుండా బోసిపోయిన భీమునిపాదం జలపాతం ఇప్పుడు జలకళతో కళకళలాడుతోంది. ఇక, తెలంగాణ నయాగరాగా పిలుచుకునే బోగత జలపాతం కూడా పాల ధారలతో కనువిందు చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 17, 2022 08:36 PM