ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు తీవ్ర చలి వీడియో

Updated on: Jan 14, 2026 | 11:20 AM

తెలంగాణ గజగజ వణుకుతోంది. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న పొడి గాలుల కారణంగా రాష్ట్రంలో ఈ మార్పులు సంభవించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పగటిపూట ఎండ కాస్త కనిపిస్తున్నా, సాయంత్రం నుంచే చలి తీవ్రత మొదలై తెల్లవారుజామున ప్రజలను గజగజ వణికిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారులు శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఇక ఉత్తర భారత దేశం ప్రస్తుతం చలి తీవ్రతకు అల్లాడిపోతుంది. రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సున్నా కంటే కిందకు పడిపోయాయి. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో 2 డిగ్రీల సెంటిగ్రేడ్, బాడ్‌మేడ్‌లో -1 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయింది. ఢిల్లీలో ఈ ఏడాది కనిష్ఠంగా 2.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా విమాన, రైలు ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నోయిడా వంటి ప్రాంతాల్లో చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు జనవరి 15 వరకు సెలవులు ప్రకటించారు. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత -5.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగా, శోపియాన్ జిల్లాలో అత్యల్పంగా -8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జలాశయాలు, పైపులైన్లలో నీరు గడ్డకట్టుకుపోతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం దక్షిణ రాష్ట్రాలపై పడుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌… మెగాస్టార్‌కి ఊరట!

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్

పండగపూట భగ్గుమంటున్న చికెన్‌, మటన్‌ ధరలు

ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..