ఇది కదా ప్రేమంటే.. పెంపుడు శునకానికి విగ్రహం !!
మానవ సంబంధాలు మంట కలుస్తున్నా నేటి తరుణంలో.. 9 సంవత్సరాలు పాటు సొంత బిడ్డలా ఎంతో అప్యాయంగా పెంచిన శునకం చనిపోతే గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేశారు.
మానవ సంబంధాలు మంట కలుస్తున్నా నేటి తరుణంలో.. 9 సంవత్సరాలు పాటు సొంత బిడ్డలా ఎంతో అప్యాయంగా పెంచిన శునకం చనిపోతే గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేశారు. వరంగల్‌లోని బ్యాంక్ కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి- దనుంజయ్ దంపతులు రాట్ వీలర్ అనే జెస్సి పెట్ డాగ్‌ను ఆప్యాయంగా పెంచుకున్నారు. రోజురోజుకు ఆ దంపతులపై మాగజీవం చూపించే విశ్వాసంతో మరింత ప్రేమ పెంచుకున్నారు. దంపతులిద్దరూ ఏదైనా పనిమీదా బయటకు వెళ్లితే వచ్చే వరకు కనీసం అన్న పానీయాలు ముట్టుకునేది కాదు. సొంత కొడుకులాగ పెరిగిన కుక్క అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోవటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మనషులకు జరిపినట్లుగానే శునకానికి కర్మకాండలు నిర్వహించారు. అ మూగ జీవం ఉంచిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. జెస్సి జ్ఞాపకార్థం గీసుకొండ మండలం మచ్చాపూర్‌లోని వారి వ్యవసాయ క్షేత్రం వద్ద కుక్క విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ మూగజీవాల పట్ల తనకున్న విశ్వాసాన్ని చాటుకున్నారు. సొంత కుటుంబ సభ్యుల చనిపోతే పట్టించుకోని ఈ రోజుల్లో స్వంత బిడ్డలా సాకిన భాగ్యలక్ష్మి- దనుంజయ్ దంపతులు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెరీ స్మాట్ గుడ్డు !! చాక్లెట్ సైజ్‌లో వింత కోడిగుడ్డు హల్‌చల్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

