వారానికి 90 గంటల పని చేయాలని సూచిస్తున్న కంపెనీల సీఈఓలు.. రోడ్డెక్కిన టెకీలు

Updated on: Mar 17, 2025 | 7:33 PM

ఉద్యోగుల పని గంటలపై కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆ తర్వాత ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఏకంగా వారానికి 90 గంటలు పనిచేయాలని సూచించడం మరిన్ని విమర్శలకు దారి తీసింది.

వీరి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు సిలికాన్ సిటీ బెంగళూరులో రోడ్డెక్కారు. ఇటు ఉద్యోగం.. అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక తీవ్ర సతమతం అవుతుంటే.. అదనపు గంటలు పని చేయాలని పరిశ్రమ పెద్దలు పిలుపునివ్వడంపై టెక్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటివరకు తమ అభిప్రాయాలను కేవలం సోషల్ మీడియాలో వెల్లడించి తమ నిరసన వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. తాజాగా బెంగళూరు నగరంలోని ఫ్రీడమ్ పార్క్ దగ్గర ఐటీ ఉద్యోగులు ధర్నా చేసారు. ఈ టెకీల ఆందోళనకు కార్మిక సంఘాల యూనియన్ అయిన సీఐటీయూ మద్దతు తెలపడంతో ఐటీ ఉద్యోగుల ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చినట్లు అయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే

చనిపోయిన కుక్క జన్యువులతో క్లోనింగ్‌.. ఖర్చు రూ. 19 లక్షలా

అలర్ట్‌.. ఇకపై ఈ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే..

ఉరుములకు భయపడిన ఉడుత.. ఏం చేసిందంటే..

బెట్టింగ్‌ ఎఫెక్ట్! యూట్యూబర్‌ హర్షసాయికి బిగ్ షాక్