Viral:సారూ మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!

|

Jul 05, 2024 | 4:29 PM

విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో మమేకమవుతారు. వారితో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. తమకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్పే టీచర్‌ తమను వదిలి వెళ్తుంటే ఆ చిన్ని హృదయాల బాధ కన్నీటి ధారగా మారింది. నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా ముద్దాడ బాలరాజు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు.

విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో మమేకమవుతారు. వారితో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. తమకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్పే టీచర్‌ తమను వదిలి వెళ్తుంటే ఆ చిన్ని హృదయాల బాధ కన్నీటి ధారగా మారింది. నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా ముద్దాడ బాలరాజు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీల్లో భాగంగా మండలంలోని కొత్త తండాకు బాలరాజు బదిలీ అయ్యాడు.

టీచర్ బదిలీపై వెళ్తున్న వేళ విద్యార్థులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్నేళ్లుగా తమకు ఎంతో ప్రేమగా అక్షరాలు నేర్పించిన ఉపాధ్యాయుడుని తమను వదిలి వెళ్లొద్దంటూ వేడుకున్నారు. చిన్నారుల అభిమానానికి ఒకింత భావోద్వేగానికి గురైన ఆ ఉపాధ్యాయుడు విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు. స్వయంగా తన చేతులతో చిన్నారి విద్యార్ధులకు ముద్దలు తినిపించారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని తాను ఎక్కడ ఉన్నా మీ మంచిని కాంక్షిస్తానని అవసరమైన తోడ్పాటు అందిస్తానని చెప్పి విద్యార్థులను ఓదార్చారు. విద్యార్థులు తనపై చూపిన అభిమానాన్ని ఉద్వేగ క్షణాలను చూసి ఒక దశలో సదరు ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి గురై కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on