స్టూడెంట్‌ చెంపపై కొట్టిన టీచర్‌.. పాపం.. ఆ విద్యార్థి చెవికి

Updated on: Jul 02, 2026 | 10:53 AM

అహ్మదాబాద్‌లో ఓ ఉపాధ్యాయుడు కొట్టిన చెంపదెబ్బతో పదో తరగతి విద్యార్థి చెవి పొర చిట్లిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైద్యుల పరీక్షల్లో గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలడంతో చికిత్స కొనసాగుతోంది. ఘటనపై విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా, పాఠశాల యాజమాన్యం సదరు టీచర్‌ను సస్పెండ్ చేసింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక ఉపాధ్యాయుడి నిర్వాకం విద్యార్థి ప్రాణాల మీదికి తెచ్చింది. నికోల్ ప్రాంతంలోని ఓస్కూల్‌లో టీచర్ కొట్టిన చెంపదెబ్బకు పదో తరగతి విద్యార్థి చెవి రంధ్రం తీవ్రంగా దెబ్బతిని పాపం సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. స్థానిక స్కూల్‌ ప్రాంగణంలో విద్యార్ధులంతా నేలపైన కూర్చుని ఉన్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు ఆ విద్యార్ధులకు ఏదో చెబుతున్నారు. వారిలో కొందరు విద్యార్ధులను పిలిచి నిలబెడుతున్నారు.. విద్యార్ధులు ఆలస్యంగా వచ్చారా.. లేక హోంవర్క్‌ చేయలేదా ఎందుకు అలా నిలబెడుతున్నారు అనే విషయం పక్కన పెడితే.. ఆ విద్యార్ధుల్లో పదో తరగతి చదువుతున్న నిజ్ అనే విద్యార్థిని, లక్ష్మణ్ పరాటే అనే ఉపాధ్యాయుడు పిలిచి అక్కడ నిలబడమని చెబుతూ విద్యార్ధి చెంపపై గట్టిగా కొట్టాడు. ఇంటికి వెళ్లాక చెవి విపరీతంగా నొప్పి రావడంతో విద్యార్ధి విలవిలలాడిపోయాడు. దాంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఈఎన్‌టీ సర్జన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి, చెవి పొర పూర్తిగా చిట్లిపోయినట్లు నిర్ధారించారు. మందులు ఇచ్చి, పది రోజుల పరిశీలన తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోతే సదరు విద్యార్థికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘోర ఉదంతంపై విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ట్రస్టీలను కలిసి నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పాఠశాల యాజమాన్యం నిందితుడైన టీచర్ లక్ష్మణ్ పరాటేను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ ఘటనను జిల్లా విద్యాశాఖ అధికారి తీవ్రంగా పరిగణించారు. పాఠశాల అంతర్గత విచారణ నివేదికతో పాటు, టీచర్ వివరాలను సమర్పిస్తూ 24 గంటల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని స్కూల్ యాజమాన్యానికి ‘షోకాజ్’ నోటీసులు జారీ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lawrence: రాజకీయాల్లో లారెన్స్ యూటర్న్?

Suriya: రాజకీయాల్లోకి సూర్య? క్లారిటీ ఇదే..

Maa Inti Bangaram: గుడ్ న్యూస్.. OTTలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ

ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!

Nandini Reddy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..

Follow Us