చెన్నైలో కారు బీభత్సం.. సడన్ బ్రేక్‌కు బదులు యాక్సిలలేటర్ ఇవ్వడంతో..
Chennai Car Accident: చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. కీల్పాక్కంలో రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ పాదచారుడు తీవ్ర గాయాలతో పాదచారుడు దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటన రోడ్డు పక్కన దుకాణంలోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యింది.
చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. కీల్పాక్కంలో రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ పాదచారుడు తీవ్ర గాయాలతో పాదచారుడు దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటన రోడ్డు పక్కన దుకాణంలోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యింది. మృతుడిని పళనిగా పోలీసులు గుర్తించారు. పళని రోడ్డు పక్క నడుచుకుని వెళ్తుండగా..కారు వేగంగా దూసుకొచ్చి ఆ వ్యక్తిని ఢీకొంది. మరో మూడు వాహనాలు సైతం ధ్వంసమయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి.. కారును అతివేగంగా నడిపిన డ్రైవర్ జయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కారును నడుపుతున్న డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలలేటర్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

