Viral: పాత సీడీలను ఉడకబెట్టిన యువతి.. ఎందుకో తెలుసా..? అద్భుతం చెయ్యడానికి..
CDలు దాదాపుగా మరుగుపడ్డాయనే చెప్పాలి. టెక్నాలజీ పెరిగిన తర్వాత సీడీలు పనికిరాని వస్తువులుగా మారిపోయాయి. కానీ కొందరు సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు అని నిరూపిస్తుంటారు. అలాంటి సంఘటనలు చాలానే నెట్టింట మనం చూశాం. తాజాగా పనికి రాని సీడీలతో ఓ యువతి అద్భుతమైన కళాఖండంగా మలిచింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
CDలు దాదాపుగా మరుగుపడ్డాయనే చెప్పాలి. టెక్నాలజీ పెరిగిన తర్వాత సీడీలు పనికిరాని వస్తువులుగా మారిపోయాయి. కానీ కొందరు సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు అని నిరూపిస్తుంటారు. అలాంటి సంఘటనలు చాలానే నెట్టింట మనం చూశాం. తాజాగా పనికి రాని సీడీలతో ఓ యువతి అద్భుతమైన కళాఖండంగా మలిచింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు యువతి ఐడియాకు మురిసిపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో యువతి కట్టెలపొయ్యిముందు కూర్చుని ఉంది. ఆమె ఏదో స్పెషల్ డిష్ రెడీ చేస్తోందని అనిపిస్తుంది కానీ.. ఆమె పొయ్యిమీద ఒక బాండీ పెట్టి దానిలో నీళ్లు పోసి మరిగిస్తోంది. అయితే ఆ చుట్టుపక్కల వంటకు సంబంధించిన పదార్ధాలేవీ లేవు. కానీ పక్కనే కొన్ని సీడీలు ఉన్నాయి. వాటిని ఆ మరుగుతున్న నీటిలో అరిసెలు వేయించినట్టు వేయించి, బయటకు తీసింది. వాటిని ముక్కలుగా చేసింది. ఆ తర్వాత తన క్రియేటివిటీని బయటపెట్టింది. వాటిలో అందమైన వాల్ హ్యాంగింగ్ తయారు చేసి, తన బెడ్‌రూమ్‌లో అందంగా అలంకరించింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా 33 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 1.9 మిలియన్ల మంది లైక్ చేశారు. లక్షలాదిమంది తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..