Fish tank cafe: అక్వేరియంలోనే హోటల్..! నీళ్లలో తిరుగుతున్న చేపల మధ్య కస్టమర్లు.. ఎట్రాక్ట్ చేస్తున్న రెస్టారెంట్ వీడియో
కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఓ రెస్టారెంట్ వినూత్న ప్రయోగం చేసింది... ఇందులో భాగంగా రెస్టారెంట్‌ని ఏకంగా చేపల అక్వేరియంలా మార్చేసింది. చెక్కతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫ్లోరింగ్‌పై మోకాలి లోతు వరకు నీటితో నింపింది.
కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఓ రెస్టారెంట్ వినూత్న ప్రయోగం చేసింది… ఇందులో భాగంగా రెస్టారెంట్‌ని ఏకంగా చేపల అక్వేరియంలా మార్చేసింది. చెక్కతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫ్లోరింగ్‌పై మోకాలి లోతు వరకు నీటితో నింపింది. అందులో రంగురంగుల చేపలను వదిలిపెట్టారు.. అందులోనే కుర్చీలు, టేబుల్స్‌ను ఏర్పాటుచేసి కస్టమర్లను ఆహ్వానించింది. నీళ్లలోని రంగురంగుల చేపలను చూస్తూ తాము అందించే ఆహార పదార్థాలను ఆస్వాదించమని గోడలపై ‘స్వీట్ ఫిష్ కేఫ్’అని రాసుకొచ్చింది.
కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు మీ ఆలోచన బాగుంది కానీ.. తినే ఆహార పదార్థాలు నీటిలో పడి కలుషితమై చేపలు లావైపోతాయి లేదా చనిపోతాయి అని ఒకరు కామెంట్ పెట్టగా, విద్యుత్ సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండండి అని మరొకరు స్పందించారు. అయితే, అంతాబాగానే ఉందిగానీ, ఈ రెస్టారెంట్ ఎక్కడుందో మాత్రం తెలియలేదు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..