Crime: డ్యూటీకి వెళ్ళి.. నీటిలో శవమై తేలిన అసిస్టెంట్ కలెక్టర్.

| Edited By: Shaik Madar Saheb

Sep 23, 2023 | 7:54 AM

కనిపించకుండాపోయిన అసిస్టెంట్‌ కలెక్టర్‌ వ్యవహారం విషాదాంతమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుస్మిత మింజ్‌ మృతదేహం అనుమానాస్పదస్థితిలో కనిపించింది. రూర్కెలాలోని సుందర్‌ఘడ్‌ ప్రాంతంలోని సెంచూరియన్‌ పార్కు జలాశయంలో డెడ్‌బాడీ లభ్యమైంది. దీంతో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుస్మిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కనిపించకుండాపోయిన అసిస్టెంట్‌ కలెక్టర్‌ వ్యవహారం విషాదాంతమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుస్మిత మింజ్‌ మృతదేహం అనుమానాస్పదస్థితిలో కనిపించింది. రూర్కెలాలోని సుందర్‌ఘడ్‌ ప్రాంతంలోని సెంచూరియన్‌ పార్కు జలాశయంలో డెడ్‌బాడీ లభ్యమైంది. దీంతో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుస్మిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులే ఆమెను హతమార్చి జలాశయంలో విసిరేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒడిశాలోని రాజగంగపూర్‌ ప్రాంతానికి చెందిన సుస్మిత రూర్కెలా కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 15న విధులకు వెళ్లిన సుస్మిత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సుస్మిత కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఆ తర్వాత ఆమె నగరంలో ఒక హోటల్లో ఉన్నట్లు సెప్టెంబర్ 19వ తేదీన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తల్లి, సోదరుడు హోటల్‌కి వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, తనకు విశ్రాంతి కావాలని, తాను ఎవరినీ కలుసుకోవాలనుకోవడం లేదని తెలిపారు. సెప్టెంబర్ 19న సాయంత్రం సెంచరీ పార్కు ప్రాంగణంలోని జలాశయంలో ఆమె మృతదేహం తేలుతూ కనిపించింది. దీంతో పార్కు సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. జలాశయం ఒడ్డున మృతురాలి హ్యాండ్‌బ్యాగ్‌, చెప్పులు లభించాయి. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఆఫీస్‌లో ఆమెను మానసికంగా వేధించడం వల్లనే తన కూతురు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 23, 2023 01:49 AM