ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు

Updated on: Dec 20, 2025 | 12:50 PM

సూర్యాపేట జిల్లా గూడెపుకుంట తండాలో విద్యుత్ షాక్ కలకలం రేపింది. సెల్ ఫోన్ ఛార్జింగ్ చేస్తుండగా హరిలాల్ అనే యువకుడు మృతి చెందాడు. వోల్టేజ్ హెచ్చుతగ్గులతో తండాలోని ఇళ్లకు షాక్ తగిలి, గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగి, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం, అధికారులపై చర్యలు డిమాండ్ చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గూడెపుకుంట తండాలో కరెంట్‌ షాక్‌ కలకలం రేపింది. ఊరు ఊరంతటికీ ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ తగిలింది. ఈ ప్రమాదంలో హరిలాల్ అనే యువకుడు మృతి చెందాడు. ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై హరిలాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండా అంతటా విద్యుత్ సరఫరా జరిగి షాక్‌ రావడంతో తండావాసులు ఆందోళనకు గురయ్యారు. తండాలో ఇళ్లలో ఉన్న సామగ్రికి, గోడలకు, ఇతర వస్తువులకు విద్యుత్‌ సరఫరా జరిగి షాక్‌ రావడంతో తండావాసులు ఉలిక్కి పడ్డారు. తండాలోని పలు ఇళ్లలో గృహోపకరణాలు టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయి భారీ నష్టం వాటిల్లింది. రెండు నెలలుగా తండాలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని, వోల్టేజ్ హెచ్చుతగ్గుల గురించి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదనీ తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే హరిలాల్ ప్రాణం పోయిందని, నిరుపేద కుటుంబానికి తీరని నష్టం జరిగిందని తండావాసులు కన్నీరు మున్నీరయ్యారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలనీ తండా వాసులు, మృతుని బంధువులు హరిలాల్ మృతదేహంతో పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. ఈ ఆందోళనతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: బాబోయ్ చలి.. గడపదాటాలంటే వణుకే

IBomma Rav: ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

Balakrishna: బాలయ్య నిర్ణయంతోనే .. ఆ రోజు ఓజీ రిలీజ్

నేను మనిషినేగా.. తాను పడిన బాధను గుర్తు చేసుకుంటూ.. బోయపాటి ఎమోషనల్

Rithu Chowdary: డిమాన్‌ కోసం బయట కష్టపడుతున్న రీతూ చౌదరి!