Viral Video: వ్యక్తి కడుపులో బ్రతికున్న ఉన్న చేప.! డాక్టర్స్ కే షాక్ ఇచ్చిన కొత్త కేసు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, క్వాంగ్ ప్రావిన్స్‌లోని హాయ్‌హా జిల్లాకు చెందిన 34 ఏళ్ల బాధితుడు ఇటీవల కడుపునొప్పితో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు కోలాన్ అంటే పెద్ద పేగు చివరి భాగంలో సజీవంగా ఉన్న 30 సెంటీమీటర్ల ఈల్ చేపను చూసి షాకయ్యారు. అతడి పేగులకు అది చిల్లులు పెట్టడం కూడా గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు.
వియత్నాంలో అసాధారణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి పేగుల్లోకి ఓ చేప చొరబడింది. అది పేగుల్లో సజీవంగా ఉండటమే కాకుండా పేగులకు చిల్లులు పెట్టి పడేసింది. కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లిన బాధితుడిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. వెంటనే ఆపరేషన్ చేసి అతన్ని ప్రమాదం నుంచి కాపాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, క్వాంగ్ ప్రావిన్స్‌లోని హాయ్‌హా జిల్లాకు చెందిన 34 ఏళ్ల బాధితుడు ఇటీవల కడుపునొప్పితో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు కోలాన్ అంటే పెద్ద పేగు చివరి భాగంలో సజీవంగా ఉన్న 30 సెంటీమీటర్ల ఈల్ చేపను చూసి షాకయ్యారు. అతడి పేగులకు అది చిల్లులు పెట్టడం కూడా గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ఎంతో క్లిష్టమైన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములకు ఆవాసమైన పురీషనాళం పక్కనే కోలాన్ ఉండటంతో ఆపరేషన్ సందర్భంగా ఇన్ఫెక్షన్ తలెత్తే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే, శస్త్రచికిత్స తరువాత ఈ సమస్య లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడి మలద్వారం, పురీషనాళం మీదుగా ఈల్ చేప పెద్ద పేగులోపలికి చొరబడి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇది అసాధారణ ఘటన అని, పేగుల్లోకి చొరబడ్డాక కూడా ఈల్ చేప సజీవంగా ఉండటం చాలా ఆశ్చర్యకరమని అన్నారు. అతడి పేగులో గాయపడ్డ భాగాల్ని వైద్యులు తొలగించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

