Sundar Pichai Life Style: ఏటా రూ.1850 కోట్ల జీతం తీసుకుంటున్న సుందర్ పిచాయ్ లగ్జరీ లైఫ్ ఇదే..

|

Jul 02, 2023 | 9:47 AM

ఓ సాధారణ మధ్య తరగతి కుర్రాడు. చదువులో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. వాళ్ల నాన్న అతడిని అమెరికా పంపించాలనుకున్నాడు. విమాన టికెట్‌ కొనాలంటే ఏడాది జీతం ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. అయినా కొడుకు భవిష్యత్తే ముఖ్యమని ముందుకెళ్లాడు. ఆ కొడుకు ఇప్పుడు ఏడాదికి 1850 కోట్ల రూపాయల జీతం అందుకుంటున్నాడు. అతనే గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌.

సాధారణ ఉద్యోగిగా గూగుల్‌లో చేరిన సుందర్‌ పిచాయ్‌ సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్‌ లాంటి గొప్ప ఆవిష్కరణలన్నీ ఆయన ఆలోచనల నుంచే పుట్టుకొచ్చినవే. కష్టానికి ప్రతిఫలంగా 2015లో ఆయనకు సీఈవో పదవి దక్కింది. చెన్నైలో ఉన్నప్పుడు ఇరుకు ఇంటి కష్టాలు చూసిన సుందర్‌ పిచాయ్‌ ప్రస్తుతం తన కుటుంబం కోసం 4 కోట్ల డాలర్ల విలువైన ఇంటిని నిర్మించుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం శాంటాక్లారా కౌంటీలో 31.17 ఎకరాల్లో ఈ భవనం ఉంది. ఇక వాహన శ్రేణి విషయానికొస్తే.. ప్రధాని మోదీ భద్రతా కాన్వాయ్‌లో ఉన్న మెర్సిడెస్‌ ఎస్‌650 కారుని సుందర్‌ పిచాయ్‌ వాడుతున్నారు. దీని విలువ దాదాపు 3.21 కోట్లు. రాజసం ఉట్టిపడే బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ, ఇంకా మెర్సిడెస్‌ వీ క్లాస్‌, కుటుంబంతో సుదూర ప్రయాణాలకు టయోటా హైఏస్ సుందర్‌ పిచాయ్‌ వాడే కార్లు. ఆయన ఖరీదైన మొబైల్‌ ఫోన్లు సైతం వాడుతుంటారు. అయితే ఎక్కువగా టెస్టింగ్‌ కోసమే అని ఓ సందర్భంలో అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..