Viral: ఆలయంలో అద్భుతం.. గర్భగుడిలో అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు.. వీడియో వైరల్.
చైత్రశుద్ధ పౌర్ణమి రోజు చంద్ర సహోదరియైన ఆజగన్మాత మోముపై ఉదయభానుడి లేలేత కిరణాలు ప్రసరించాయి. గర్భగుడిలోని అమ్మవారి వదనాన్ని సూర్యకిరణాలు తాకడంతో చంద్రబింబం వంటి అమ్మవారి మోము మరింత దేదీప్యమానంగా వెలిగిపోయింది.
కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలం చెబ్రోలు గ్రామంలో కొలువైన శ్రీ వేగులమ్మ అమ్మవారి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. చైత్రశుద్ధ పౌర్ణమి రోజు చంద్ర సహోదరియైన ఆజగన్మాత మోముపై ఉదయభానుడి లేలేత కిరణాలు ప్రసరించాయి. గర్భగుడిలోని అమ్మవారి వదనాన్ని సూర్యకిరణాలు తాకడంతో చంద్రబింబం వంటి అమ్మవారి మోము మరింత దేదీప్యమానంగా వెలిగిపోయింది. ప్రతియేటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ఇలా అమ్మవారి మోముపై సూర్యకిరణాలు పడటం ఇక్కడి విశిష్టత. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాలనుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఏడాదికూడా భక్తుల కోరికను మన్నిస్తూ సూర్యభగవానుడు వేగులమ్మ అమ్మవారి గర్భగుడిలోకి తన వెలుగులను ప్రసరింపజేశాడు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించిపోయారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్య దైవం శ్రీవేగులమ్మ అమ్మవారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా అమ్మవారిని విశ్వసిస్తారు. అమ్మవారిని దర్శించుకుని తమ కోర్కెలు విన్నవించుకోడానికి ఇరు రాష్ట్రాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..