వేసవి తాపం నుంచి తప్పించుకోడానికి ఇతని ఐడియా అదుర్స్‌

Updated on: Jun 22, 2025 | 2:22 PM

వేసవి కాలంలో ఇంట్లో ఏది ముట్టుకున్నా వేడిగా ఉంటుంది. ఇంటిపైన ట్యాంకులో నీళ్లు అయితే చెప్పనక్కర్లేదు. ఎండ వేడికి మరిగి మరిగి ఉంటాయి. ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు చల్లని నీళ్లతో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ట్యాప్‌ ఆన్ చేయగానే నీళ్లు వేడిగా వస్తాయి. ఆ నీటితో స్నానం చేయాలంటే కొంచెం కష్టమే.

అందుకే ఓ వ్యక్తి అద్భుతమైన ప్లాన్‌ వేశాడు. మండు వేసవిలో కూడా ట్యాప్‌లోనుంచి వేడి నీళ్లను చల్లగా మారిపోయేలా చేశాడు. అతని ఐడియాకి నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి తన వాష్‌రూమ్‌లోని షవర్‌కి ఓ జల్లెడలాంటిది వేలాడదీసాడు. దాని నిండా ఐస్‌ ముక్కలు నింపాడు. ఇప్పుడు షవర్‌ ఆన్‌చేయగానే నీళ్లు కింద ఉన్న జల్లెడలో ఉన్న ఐస్‌ముక్కలమీద పడి చల్లగా కిందకు వస్తున్నాయి. ఇప్పుడు అతను హ్యాపీగా చల్ల..చల్లని కూల్‌..కూల్‌.. అంటూ హాయిగా స్నానం చేసేసాడు. ఆ చల్లని నీళ్లు మండువేసవిలో కూడా అతణ్ని వణికించాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను లక్షల మంది వీక్షించగా వేలాదిమంది లైక్‌ చేశారు. ఈ ఐడియా చాలా బావుందని కొందరు, ఈ టెక్నాలజీ మన దేశం దాటిపోకుండా కాపాడుకోవాలని ఇంకొందరు కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖాళీ కడుపుతో కొబ్బరి తింటే అద్భుతమైన ప్రయోజనాలు

అరటి పువ్వా.. అని తీసిపారేయకండి.. వారికి ఇది దివ్యౌషధం

పచ్చి బాదం పప్పు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే వదలరు

కదలకుండా ఉన్న మొసలిని చూసి చనిపోయిందనుకున్నారు.. ఆ తర్వాత

చెట్ల పొదల్లో కళ్లు చెదిరే సీన్‌.. ఆశ్చర్యంతో చూస్తుండిపోయిన స్థానికులు