National Anthem: ఈ విద్యార్ధులు జాతీయ గీతం పాడిన తీరుకు మనసు పులకించక మానదు..!
నాగ్‌పూర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు దేశ ప్రజల మనసులను గెలుచుకునేలా ఓ ప్రదర్శన చేశారు. కేంద్రీయ విద్యాలయ VSNలో ఉదయం వేళ స్కూల్
నాగ్‌పూర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు దేశ ప్రజల మనసులను గెలుచుకునేలా ఓ ప్రదర్శన చేశారు. కేంద్రీయ విద్యాలయ VSNలో ఉదయం వేళ స్కూల్ అసెంబ్లీ సందర్భంగా విద్యార్థులు సంకేత భాషలో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ చిన్నారులు తమ చేతులతో సైగలు చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. ట్విట్టర్‌లోని ఈ వీడియో చూసి నెటిజన్లంతా ముగ్ధులయ్యారు. ఇక ఈ వీడియో చూసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయ అసోసియేషన్ తన అధికారిక ట్విట్టర్‌లో ఈ వీడియోను ట్వీట్ చేయడంతో పాడు ‘‘గుడ్ మార్నింగ్ కేంద్రీయ విద్యాలయ VSN నాగ్‌పూర్.. ఉదయం అసెంబ్లీలో సంకేత భాష ద్వారా జాతీయ గీతం ఆలాపన’’ అని కాప్షన్ రాసుకొచ్చింది. మనసును హత్తుకునేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించడమే కాక విద్యార్థులను అభినందిస్తున్నారు.ఈ వీడియోపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ ‘జాతీయ విద్యా విధానం 2020 ను అమలు చేయడానికి మార్గం సుగమం అయింది. భారతీయ పాఠశాలల్లో సంకేత భాషను ఒక భాషా సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టడం అనేది.. లక్షలాది మంది వికలాంగ విద్యార్థులను శక్తివంతం చేయడానికి తీసుకున్న అనేక చర్యలలో ఒకటి’’ అని తెలిపారు. 2021లో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో భారతీయ సంకేత భాషను బోధించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
