STUDENTS LETTER: పుష్ప సినిమాకు వెళ్లాలి.. తగ్గేదేలే అంటూ ప్రిన్సిపల్‌కు లేఖ.!(వీడియో)

Updated on: Jan 02, 2022 | 9:19 AM

పర్సనల్‌ లీవ్‌ కావాలని ఒకప్పుడు టీచర్‌ను అడగాలంటేనే విద్యార్థులు భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు విద్యార్థుల టైం మారింది.. టైమింగూ మారింది. సినిమా కోసం సెలవు కావాలంటూ విశాఖలో ఇంటర్‌ విద్యార్థులు ఏకంగా ప్రిన్సిపల్‌కే లేఖ రాశారు.


పర్సనల్‌ లీవ్‌ కావాలని ఒకప్పుడు టీచర్‌ను అడగాలంటేనే విద్యార్థులు భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు విద్యార్థుల టైం మారింది.. టైమింగూ మారింది. సినిమా కోసం సెలవు కావాలంటూ విశాఖలో ఇంటర్‌ విద్యార్థులు ఏకంగా ప్రిన్సిపల్‌కే లేఖ రాశారు. ఈ నెల 17న పుష్ప సినిమా రిలీజ్‌ అవుతుంది.. సో.. మాకు సెలవు కావాలని కోరారు. సెలవు ఇవ్వకపోయినా తాము రాకపోవడం మాత్రం పక్కా అని తెలిపారు విద్యార్థులు.ఇంటికి మెసేజ్‌లు పంపొద్దని, కాల్స్‌ చేయొద్దని లేఖలో ప్రిన్సిపల్‌ను కోరారు. సెలవు ఇవ్వాలంటూ కోరుతూనే.. చివర్లో తగ్గేదేలే అంటూ ప్రిన్సిపల్‌కు ఓ బంపర్‌ ఆఫర్ ఇచ్చారు. తమ వద్ద ఓ అదనపు టికెట్‌ ఉందని కావాలంటే జాయిన్‌ కావొచ్చని ఆహ్వానించారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌.. తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్స్‌.