chai pani: పిజ్జా, బర్గర్‌లు దీని ముందు జుజుబీలే.! దుమ్ము రేపుతున్న “చాయ్‌ పానీ” ఎక్కడంటే.?

Updated on: Jun 21, 2022 | 4:43 PM

మన స్ట్రీట్‌ ఫుడ్‌ రుచులు ఎల్లలు దాటుతున్నాయి. పిజ్జాలు, బర్గర్‌లు తినే అమెరికన్‌లు సైతం ఆహా ఏమిరుచి తినరా మైమరిచి అంటూ మన వంటకాల్ని లొట్టలేసుకుంటూ ఆవురావురుమంటూ తింటున్నారు. స్ట్రీట్‌ ఫుడ్‌లను అందించడంలో


మన స్ట్రీట్‌ ఫుడ్‌ రుచులు ఎల్లలు దాటుతున్నాయి. పిజ్జాలు, బర్గర్‌లు తినే అమెరికన్‌లు సైతం ఆహా ఏమిరుచి తినరా మైమరిచి అంటూ మన వంటకాల్ని లొట్టలేసుకుంటూ ఆవురావురుమంటూ తింటున్నారు. స్ట్రీట్‌ ఫుడ్‌లను అందించడంలో భారత్‌ రెస్టారెంట్‌లే బాగున్నాయంటూ కొనియాడుతున్నారు.భారతీయ వంటకాల్ని అమెరికన్‌లకు రుచి చూపించేందుకు 2009లో నార్త్‌ కరోలినాలోని యాష్‌లో ‘చాయ్‌ పానీ’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు మెహెర్‌ వాన్‌ ఇరానీ. కేవలం 8 డాలర్ల నుంచి 17 డాలర్ల మధ్య ధరలతో చాట్‌లను అందించే ఆ రెస్టారెంట్‌ మంచి పేరుంది. భారత్‌, అమెరికన్‌లకే కాదు వివిధ దేశాలకు చెందిన ఫుడ్‌ లవర్స్‌ను ఆకట్టుకుంది. అమెరికాలో 1946 నుంచి సంప్రాదాయ వంటకాల్ని అందించే బ్రెన్నాన్స్‌ వంటి హోటల్స్‌ ను చాయ్‌ పానీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ధర తక్కువ, రుచికరమైన వంటకాల్ని అందించడంతో “చాయ్‌ పానీ” ఫుడ్‌ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో 40 ఏళ్లలో ఎన్నుడూ చెల్లించిన విధంగా అమెరికన్‌లు ఆహరం కోసం ఈ ఏడాది అత్యధికంగా చెల్లిస్తున్నారు. అదే సమయంలో రీజనబుల్‌ ప్రైస్‌లో చాయ్‌ పానీ వంటకాలు లభ్యం కావడంతో అమెరికాలో బెస్ట్‌ రెస్టారెంట్‌గా ప్రసిద్దికెక్కింది. జేమ్స్‌ బియర్డ్‌ ఫౌండేషన్‌ అవార్డ్స్‌ సొంతం చేసుకొని ప్రథమ స్థానంలో నిలిచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్‌.. భార్యబాధితులు వింత పూజలు వైరల్‌ అవుతున్న వీడియో..

Published on: Jun 21, 2022 04:43 PM