Elephant: ఏనుగు ముందు ఓ వ్యక్తి పిచ్చి చేష్టలు.. వెర్రివేషాలేస్తే ఏనుగు ఊరుకుంటుందా..!

|

May 22, 2023 | 9:28 AM

అటవీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు వాహనదారులకు వన్యమృగాలు తారసపడుతుంటాయి. వాహనదారులు ముందే గమనించి ఆగిపోతే వాటి దారిన అవి వెళ్లిపోతాయి. కాదని పిచ్చి వేషాలు వేస్తే చుక్కలు చూపిస్తాయి.

అటవీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు వాహనదారులకు వన్యమృగాలు తారసపడుతుంటాయి. వాహనదారులు ముందే గమనించి ఆగిపోతే వాటి దారిన అవి వెళ్లిపోతాయి. కాదని పిచ్చి వేషాలు వేస్తే చుక్కలు చూపిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. ధర్మపురిలో హోగెనెక్కల్ ఫారెస్ట్ ఏరియాలో ఓ ఏనుగు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ ఒకవైపున ఆగిపోయింది. వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి. దాంతో కాలు దువ్వుతూ, ఘీంకరిస్తూ వాహనాల రద్దీ తగ్గేవరకూ చూస్తోంది. అది చూసి కొందరు కార్లు, బైకులను ఆపేశారు. బస్సులు మాత్రం వెళ్తున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి ఏనుగు వద్దకు వెళ్లి, దానికి దణ్ణం పెడుతూ రకరాలుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ ఏనుగు చాలా కోపంగా ఉంది. అక్కడున్న వాళ్లు అతన్ని వెనక్కి రమ్మని పిలిచినా అతను వినకుండా ఏనుగు ఎదురుగా నిలుచుని చేతులెత్తి పోజులిచ్చాడు. ఈ సమయంలో ఏనుగు ఘీంకరిస్తూ అతడిపైకి దూసుకొచ్చినంత పని చేసింది. అయితే, ఏమనుకుందో మరు క్షణంలో వెనక్కి తగ్గింది. అతడు మాత్రం తాపీగా అక్కడి నుంచి వచ్చేశాడు. అతడు తాగి ఇలా చేశాడని స్థానికులు చెప్పారు ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు సాకేత్ బడోలా, రమేశ్ పాండే షేర్ చేశారు. “ఇలాంటి చికాకు కలిగించే మూర్ఖులను తట్టుకోవడం అంత సులభం కాదు. అందుకే ఆ ఏనుగులను అంతలా గౌరవించేది” అని బడోలా రాసుకొచ్చారు. “ ఆ ఏనుగు ఈ మనిషిని సహించి, క్షమించి విడిచిపెట్టింది’’ అని రమేశ్ పాండే క్యాప్షన్ ఇచ్చారు. నెటిజన్లు ఆ వ్యక్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అతడు అదృష్టవంతుడు.. ఏనుగు రెండు సార్లు హెచ్చరించి వదిలేసింది’’ అని ఒకరు కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.